ఇంతకు ముందు ఊబర్‌లో ఏదైనా వెహికిల్ బుక్ చేయాలనుకుంటే తప్పనిసరిగా ఊబర్ యాప్ డౌన్ లోడ్ చేసుకుని క్యాబ్ బుక్ చేసుకునే వారు. కానీ ఇప్పుడు మెసిజింగ్ యాప్ అయినటువంటి వాట్సాప్ లో క్యాబ్ బుక్ చేసుకునే సదుపాయం అందించబడుతోంది. ఊబర్ రైడ్‌లను ఇప్పుడు వాట్సాప్‌లో తమ జర్నీ బుక్ చేసుకోవచ్చు. క్యాబ్‌కంపెనీ ఊబర్ త్వరలో వాట్సాప్ కోసం కొత్త ఎంపికను అందుబాటులోకి తీసుకురాబోతుంది. ఊబర్ కొత్త క్యాబ్ బుకింగ్ సర్వీస్‌ను ఢిల్లీ-ఎన్‌సీఆర్ కోసం ఆగస్టు తొలి వారం నుంచి ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది.
ఇక ఈ ఫీచర్ ను మొదటిసారిగా గత ఏడాది డిసెంబర్ లో లక్నో నగరంలో పరీక్షించారు. ఈ ప్రయోగం విజయవంతం అయితే.. దీని తరువాత మీరు ఊబర్ యాప్ ను విడిగా డౌన్‌లోడ్ చేయాల్సిన అవసరం లేదు. వాట్సాప్ ఉపయోగించి క్యాబ్‌ను బుక్ చేసుకోవచ్చు. ఇక ఊబర్ చెప్పినట్టుగా వాట్సాప్ ద్వారా క్యాబ్‌లను బుక్ చేసుకునే వినియోగదారులకు ఊబర్ యాప్‌లో నేరుగా రైడ్‌లను బుక్ చేసుకునేంత భద్రతను అందించబడుతోంది. వాట్సాప్ ద్వారా క్యాబ్ బుక్ చేసిన తరువాత రైడర్ లేదా డ్రైవర్ పేరు, లైసెన్స్ ప్లేట్ వంటి సమాచారం వినియోగదారులకు పంపించబడుతుంది. అదేవిధంగా లొకేషన్ ఆధారంగా పికప్ పాయింట్ సమాచారం కూడా డ్రైవర్‌కి పంపబడుతుంది. డ్రైవర్‌తో మాట్లాడేటప్పుడు వినియోగదారుల గుర్తింపు గోప్యంగా ఉంచబడుతుంది. యూజర్ల వాట్సాప్ నెంబర్ ఇక డ్రైవర్ మాత్రం చూడలేడు.
Advertisement
Advertisement
వాట్సాప్‌లో ఊబర్‌ను రైడ్ చేసే విధానం :
- +917292000002 నెంబర్ కు హాయ్ అని రాసి మీ వాట్సాప్‌లో మెసేజ్ చేయాలి.
- సందేశం పంపిన తరువాత మీరు చాట్‌బట్‌లో పికప్, డ్రాప్‌లో లొకేషన్ అడగబడతారు.
- లొకేషన్ గురించిన సమాచారాన్ని అందించిన తరువాత.. మీకు రైడ్ సమాచారం అందించబడుతుంది.
- చార్జీ, డ్రైవర్ వచ్చే సమయాన్ని చూపిస్తుంది.
- ఓకే చెప్పిన తరువాత మీకు డ్రైవర్ సమాచారం OTP పంపబడుతుంది.
- దీని తరువాత మీరు OTP నమోదు చేయడం ద్వారా రైడ్ ను ప్రారంభించగలరు.
Also Read :