Home » చంద్రబాబు తరపు  లాయర్ పై  పోలీసులకు ఫిర్యాదు చేసిన వైసీపీ నేతలు.. అందుకోసమేనా ?

చంద్రబాబు తరపు  లాయర్ పై  పోలీసులకు ఫిర్యాదు చేసిన వైసీపీ నేతలు.. అందుకోసమేనా ?

by Anji
Ad

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసుకు సంబంధించి ఆరోపణల నేపథ్యంలో చంద్రబాబు నాయుడుని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం విధితమే. అసలు చంద్రబాబు కి బెయిల్ ఎందుకు రాలేదు..? చంద్రబాబు కేసు వాదిస్తుంది సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ సిద్ధార్థ్ లూథ్రా. ఆయన చాలా సంవత్సరాల ఎక్స్ పీరియన్స్ ఉంది. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు తరపున కోర్టులో వాదనలు వినిపిస్తున్న సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ సిద్ధార్థ లూథ్రాపై వైఎస్సార్సీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Advertisement

రాష్ట్ర ప్రజలను ఆయుధాలు పట్టి ఉద్యమించాలంటూ లూథ్రా ఉసిగొలుపుతున్నారని ఆరోపిస్తూ పోలీసులను ఆశ్రయించారు వైసీపీ నేతలు. ఈ మేరకు తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్య ప్రకాశరావుతో కలిసి నేతలు  పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారు. చంద్రబాబు తరపున వాదిస్తున్న లూథ్రా ఆశించిన తీర్పు రాని కారణంగా గురుఘోవింద్ సింగ్ సూక్తిని ఉదహరించి ఆయుధాలతోనే పని జరుగుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రజలను హింసకు ప్రేరేపించడం నేరమని.. దీనిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.

Advertisement

అన్ని విధాలుగా ప్రయత్నించినప్పటికీ.. న్యాయం కనుచూపుమేరలో లేదని తెలిసినప్పుడు కత్తి తీసి యుద్ధం చేయడమే సరైంది అంటూ లూథ్రా ట్వీట్ చేశారు. సిక్కుల మత గురువు గురుగోవింద్ సింగ్ సూక్తిని ప్రస్తావిస్తూ.. ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మరోవైపు ఈ సంచలన ట్వీట్ చేసిన అనంతరం లాయర్ లూథ్రా రాజమహేంద్ర వరం సెంట్రల్ జైలులో చంద్రబాబును కలిశారు. లోకేష్ తో కూడా సమావేశమయ్యారు. విజయవాడ నుంచి రాజమహేంద్ర వరం చేరుకున్న లూథ్రా లోకేష్ బస చేస్తున్న నివాసానికి వెళ్లి ఆయనతో సమావేశమయ్యారు. చంద్రబాబును కలిసిన తరువాత లూథ్రా ఢిల్లీకి వెళ్లిపోయారు. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

పవన్ కళ్యాణ్ పై రోజా సంచలన వ్యాఖ్యలు..భార్య ఉండగా వేరే అమ్మాయితో ! !

Virat Kohli : వాటర్ బాయ్’గా మారిన విరాట్ కోహ్లి..వీడియో వైరల్‌ !

Visitors Are Also Reading