Home » చిరంజీవిది గొప్ప మనసు…”యముడికి మొగుడు” టైంలోనే ఆ పని చేశాడుగా…?

చిరంజీవిది గొప్ప మనసు…”యముడికి మొగుడు” టైంలోనే ఆ పని చేశాడుగా…?

by Bunty
Published: Last Updated on

ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి కెరీర్ ప్రారంభంలో చిన్నచితక పాత్రల్లో నటించారు. ఆ తర్వాత ఏకంగా హీరోగా అవకాశం రావడంతో తన టాలెంట్ ను నిరూపించుకున్నాడు. వరుస హిట్లతో దూసుకుపోతూ టాలీవుడ్ లో బిజీగా మారిపోయాడు. మెగాస్టార్ కెరీర్ ప్రారంభం నుండి ఎన్నో గొప్ప చిత్రాల్లో నటించాడు. అలా ఆయన నటించిన సినిమాల్లో యముడికి మొగుడు సినిమా కూడా ఒకటి.

READ ALSO : Shakuntalam : ఒకరోజు ముందే ఓటిటిలోకి వచ్చేసిన “శాకుంతలం”… ఎందులో స్ట్రీమింగ్ అంటే!

ఈ సినిమా చిరంజీవితో పాటు ఎంతో మందికి లైఫ్ ఇచ్చింది. సినిమాల్లో ప్రయత్నిస్తున్న సమయంలో చిరంజీవి మరియు సుధాకర్ రూమ్ మేట్స్ అన్న సంగతి తెలిసిందే. అయితే అప్పటివరకు విలన్ పాత్రలు చేసిన సుధాకర్… యముడికి మొగుడు సినిమాలో కమెడియన్ గా నటించారు. తనకంటూ ప్రత్యేకమైన మేనరిజంతో సుధాకర్ ప్రేక్షకులను నవ్వించాడు. ఇది ఇలా ఉండగా, ఈ సినిమాలో చిరంజీవి డైలాగులకు యువత రెచ్చిపోయారు.

READ ALSO : ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్..పాక్ లో ఇంటర్నెట్, సోషల్ మీడియా “బ్లాక్”

Chiranjeevi: చరణ్‌తో ఇకపై అలా సినిమాలు చేయకపోవచ్చు.. చిరంజీవి షాకింగ్ కామెంట్స్! - 10TV Telugu

సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. అంతేకాదు చాలా కేంద్రాల్లో వంద రోజులు ఈ సినిమా ఆడింది. ఈ క్రమంలో యముడికి మొగుడు శత దినోత్సవం చేశారు. అదే సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. దాంతో చలించిపోయిన చిరు, ఆత్మహత్య చేసుకున్న రైతులకు చెందిన పత్తి రైతుల కుటుంబ సభ్యులను పిలిపించి వారికి ఆర్థిక సాయం అందించి మానవత్వం చాటుకున్నారు. చిరు గొప్ప మనసుకి ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు.

READ ALSO : ‘ది కేరళ స్టోరీ’ మూవీపై విజయశాంతి వివాదాస్పద వ్యాఖ్యలు

Visitors Are Also Reading