ప్రపంచ నెంబర్ వన్ టెన్నిస్ ఆటగాడు నొవాక్ జకోవిచ్ రెండవ సారి ఆస్ట్రేలియాలో నిర్బంధంలో ఉన్నాడు. ఈ మేరకు జకోవిచ్ తరపు న్యాయవాది ప్రకటించాడు. విచారణ ఆదివారం ఆస్ట్రేలియాలోని కోర్టులో జరుగనున్నది. ఆస్ట్రేలియా ప్రభుత్వం అతన్ని బహిరంగ ముప్పుగా అభివర్ణించింది. టీకా వేసుకోకుండా జొకొవిచ్ ఆస్ట్రేలియాలో ఉండవచ్చా..? లేదా అనేది ఇప్పుడు కోర్టు నిర్ణయిస్తుంది.
Advertisement
గతంలో ఆస్ట్రేలియా ఇమ్మిగ్రేషన్ మంత్రి అలెక్స్ హాక్ నొవాక్ జకోవిచ్ వీసాను రద్దు చేసిన విషయం తెలిసినదే. ఆస్ట్రేలియా ప్రభుత్వం నిర్ణయం అహేతుకం అని, జకొవిచ్ తరుపున న్యాయవాది వ్యాఖ్యానించారు. కోర్టులో ఆయన అప్పీలు చేసుకోగా.. ఆదివారం విచారణ చేపట్టనుంది. జొకొవిచ్ ఆస్ట్రేలియా ఓపెన్ ఆడాలంటే సోమవారం నాటికీ టోర్నీకి హాజరుకావాల్సి ఉంటుంది. ఆయన కోర్టులో ఓడిపోతే అతని వీసా రద్దవ్వనుంది. అదేవిధంగా ఆస్ట్రేలియా వీసాపై కూడా మూడేండ్ల పాటు నిషేదం విధించనున్నారు.
Advertisement
జొకొవిచ్ కరోనా సోకినప్పటికీ సెర్బియాలో పలు కార్యక్రమాలకు హాజరైనట్టు సమాచారం. ఓ జర్నలిస్ట్‌ను కలిసానని స్వయంగా జొకొవిచ్ ఒప్పుకున్నాడు. ఆస్ట్రేలియాలో అడుగు పెట్టేందుకు ఇమ్మిగ్రేషన్ ఫామ్‌లోనూ ఎన్నో తప్పులు చేసాడు. ఈ కారణంగా ఆస్ట్రేలియా చేరుకోగానే అతని వీసా రద్దు చేసారు. ఇంతకు ముందు కేసు గెలిచిన నొవాక్.. వీసా రద్దు విషయంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం కేసును గెలిచాడు. జొకొవిచ్ వీసాను ఆస్ట్రేలియా ప్రభుత్వం మెల్బోర్న్ కోర్టు తిరస్కరించింది. అతని పాస్ పోర్టుతో పాటు ప్రభుత్వం జప్తు చేసిన ఇతర వస్తువులను వెంటనే తిరిగివ్వాలని కోర్టు ఆదేశించింది.
ఈ విషయాలు చాలా బాధకరం అని జొకొవిచ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకటించాడు. అందుకు కారణాలు కూడా జొకొవిచ్ వివరణ ఇచ్చాడు. ఆస్ట్రేలియాలో తన ఉనికి గురించి ప్రజల ఆందోళనను తగ్గించడానికి తప్పుడు సమాచారం చేరవేయద్దంటూ కోరాడు. నాకు కరోనా స్పీడ్ టెస్ట్ లో తేలింది. ఆ తరువాత పరీక్షలో పాజిటివ్ గా వచ్చింది. నాకు కరోనా లక్షణాలు లేకపోయినా జాగ్రత్తలు తీసుకున్నాను. నా ప్రయాణానికి సంబంధించి తప్పుడు వివరాలు కూడిన పత్రాలు సపోర్టు టీమ్ తయారు చేసారు అంటూ చెప్పుకొచ్చాడు. ఇది ఉద్దేశ పూర్వకంగా చేయలేదు అని, క్లారిటీ ఇచ్చేందుకు బృందం ఆస్ట్రేలియా ప్రభుత్వానికి అదనపు సమాచారాన్ని అందించింది అని చెప్పుకొచ్చాడు జొకొవిచ్.