ఇండియన్ ప్రీమియర్ లీగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు ఏమాత్రం ప్రేక్షకుల్లో క్రేజ్ తగ్గలేదు. ఐపీఎల్ ప్రారంభమైతే చాలు అందరూ… ఆ మ్యాచ్లను చూసేందుకే ఆసక్తి చూపిస్తారు. ఇక 2023 ఐపీఎల్ సీజన్ మరో మూడు నెలల్లోనే ప్రారంభం కానుంది. అలాగే, ఈ సారి మహిళల ఐపీఎల్ కూడా ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలోనే, మహిళల ఐపీఎల్ కీలక ప్రకటన వచ్చింది.
Advertisement
మహిళల ఐపీఎల్ మీడియా హక్కులను వయాకామ్ 18 దక్కించుకుంది. ఐదేళ్ల కాలానికి వయాకామ్ రూ.951 కోట్లతో బిడ్ దాఖలు చేసిందని బీసీసీఐ సెక్రటరీ జైషా సోమవారం ట్విట్ చేశారు. 2023-27 మధ్య ఒక్కో మ్యాచ్ ప్రసార హక్కుల కోసం వయాకామ్, రూ 7.09 కోట్లు చెల్లించనుంది నెట్ వర్క్-18 కి చెందిన వయాకామ్ పురుషుల ఐపిఎల్ కు డిజిటల్ ప్రసార హక్కులను సైతం దక్కించుకుంది.
Advertisement
ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో జరుగుతున్న ఎస్ఏటి 20 లీగ్ ప్రసార హక్కులను కూడా ఆ సంస్థసొంతం చేసుకుంది. మహిళల ఐపీఎల్ తొలి సీజన్ లో ఐదు జట్లు డబుల్ రౌండ్ రాబిన్ టోర్నీలో పోటీ పడనున్నాయి. మార్చి 2023లో ఈ టోర్నీ ప్రారంభం కానుంది. మహిళల ఐపీఎల్ ఫ్రాంచైజీల ప్రకటన జనవరి 25 జరగనుందని క్రిక్ బజ్ కథనం పేర్కొంది. మహిళల ఐపీఎల్ ఫ్రాంచైజీని సొంతం చేసుకోవడానికి మాంచేస్టర్ యునైటెడ్ గ్రూప్ ఆసక్తితో ఉంది. ఫిబ్రవరి నెలలో ఆటగాళ్ల వేలం నిర్వహించనుండగా, ప్లేయర్లు జనవరి 26 లోగా పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
READ ALSO : అందరి ముందే కోపంతో కుర్చీ విసిరేసిన చిరంజీవి..బిత్తరపోయిన దర్శకుడు..!