Home » విడాకుల తర్వాత మహిళలకి ఉండే హక్కులు ఏవో తెలుసా..?

విడాకుల తర్వాత మహిళలకి ఉండే హక్కులు ఏవో తెలుసా..?

by Sravanthi
Ad

పెళ్లి అంటే ప్రతి ఒక్కరు కూడా ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు. పెళ్లి తర్వాత ప్రతి ఒక్కరి జీవితం కూడా మారుతుంది. పెళ్లి తర్వాత జీవిత భాగస్వామితో కలిసి సంతోషంగా ఉంటేనే జీవితం బాగుంటుంది. ప్రతి చిన్న విషయాన్ని పెద్దది చేసుకుంటూ ప్రతి మాటను అపార్థంగా తీసుకుంటూ సరైన కమ్యూనికేషన్ లేకుండా అహంకారానికి పోతూ చాలామంది రిలేషన్ ని చెడగొట్టుకుంటున్నారు. పైగా ఈ రోజుల్లో చాలామంది విడాకులు కూడా తీసుకుని విడిపోతున్నారు.

Advertisement

విడాకుల తర్వాత ఒంటరిగా ఉండడం కష్టమైనా విడిపోతేనే హాయిగా ఉంటామని చాలామంది భావిస్తున్నారు. విడాకుల తర్వాత మహిళలకి ఉండే హక్కుల గురించి ఇప్పుడు చూద్దాం.. ఆదాయం లేని భార్యకు తిండి, బట్టలు, వసతి, విద్యా, వైద్య చికిత్స కోసం ఖర్చులు జీవిత భాగస్వామి ఇవ్వాలని హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ 1956లోని సెక్షన్ 3బి చెప్తోంది. వివాహం కాని కూతురు ఉంటే ఆమె వివాహం అయ్యేదాకా అవసరమైన ఖర్చులు ఇవ్వాలి.

Also read:

Advertisement

Also read:

భర్త మరణిస్తే ఆమె మామగారు మెయింటెనెన్స్ ఇవ్వాలని చట్టంలోని సెక్షన్ 19 చెప్తోంది పెళ్లి సమయంలో ఇచ్చిన కట్నాన్ని కూడా వెనక్కి తీసుకునే అవకాశం ఉంది దీనికోసం ఒక అగ్రిమెంట్ ని రాసుకోవాలి. దాన్ని బట్టి కేసు ఫైల్ చేసుకోవచ్చు. అప్పుడు విడాకులు మంజూరు అవుతాయి. ఇది పరస్పర అంగీకారంతో జరిగే విడాకుల్లో జరుగుతుంది. ఒకవేళ కోర్టు బయట సెటిల్ చేసుకుంటే వెంటనే విడాకులు మంజూరు చేస్తారు విడాకులు టైంలో ఎటువంటి భరణం ఆశించకపోయిన భవిష్యత్తులో ఆమె తన మాజీ భర్త నుండి భరణం అడిగే అవకాశం ఉంది. భవిష్యత్తులో పిల్లలు కూడా ఆస్తులు లేదా భరణం కోసం కేసులు వేసుకోవచ్చు. పూర్తి బాధ్యత కేవలం తల్లికి మాత్రమే అని అగ్రిమెంట్లో రాసుకొని ఉంటే మాత్రం పిల్లలకు ఆస్తులు వచ్చే అవకాశం లేదు.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading