Home » Gangs of Godavari Review: గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి హిట్టా, ఫట్టా..?

Gangs of Godavari Review: గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి హిట్టా, ఫట్టా..?

by Sravanthi
Ad

Gangs of Godavari Review: గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాకు సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మించారు. యువన్ శంకర్ సంగీతాన్ని అందించారు. విశ్వక్ సేన్, అంజలి, నేహా శెట్టి, నాజర్, పి. సాయి కుమార్, హైపర్ ఆది తదితరులు నటించారు. కృష్ణ చైతన్య దర్శకత్వం వహించగా.. అనిత్ మదాడి సినిమాటోగ్రఫీ అందించారు. ఇక ఈ సినిమా కథ రివ్యూ రేటింగ్ చూద్దాం.

సినిమా: గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి
దర్శకత్వం: కృష్ణ చైతన్య
నిర్మాత: సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య
నటీ నటులు: విశ్వక్ సేన్, అంజలి, నేహా శెట్టి, నాజర్, పి. సాయి కుమార్, హైపర్ ఆది తదితరులు
సినిమాటోగ్రఫీ: అనిత్ మదాడి
సంగీతం: యువన్ శంకర్

Advertisement

కథ మరియు వివరణ:

కథ విషయానికి వచ్చేస్తే పని పాట లేకుండా తిరిగే ఒక కుర్రాడు ఊళ్లో పాలిటిక్స్ ద్వారా జరుగుతున్న అన్యాయాన్ని చూస్తూ తట్టుకోలేక పోతాడు. పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చి రాజకీయం అనే వ్యవస్థను మార్చాలని ఉద్దేశంతో రంగంలోకి దిగుతాడు. అనుకున్న విధంగా చేయగలిగాడా లేదంటే అతను ప్రేమించిన అమ్మాయికి సొంతం అయ్యాడా అనేది తెలియాలంటే సినిమా చూడాలి.

దర్శకుడు కృష్ణ చైతన్య ఈ సినిమాను చాలా ఎంగేజింగ్ గా తీసుకురావడానికి ట్రై చేశారు ఇంతకుముందు తను చేసిన రౌడీ ఫెలో, చల్ మోహన్ రంగా సినిమాలతో కంపేర్ చేసి చూస్తే ఇది కాస్త డిఫరెంట్ గా ఉంది ఈ మూవీని మాస్ యాంగిల్ లో ఎంచుకొని మాస్ ప్రేక్షకుల్ని అలరించడానికి ట్రై చేశారు. ఈ సినిమా స్టార్టింగ్ ఎపిసోడ్ నుండి ఎండింగ్ ఎంగేజ్ చేసే విధంగా సీన్లు రాసుకోవడం నార్మల్ విషయం కాదు. అద్భుతంగా కథని తీసుకున్నారు.

Advertisement

Also read:

ఏ క్యారెక్టర్ ఎంత దాకా వాడాలో అంతలా వాడుకున్నారు ప్రతి ఒక్కరూ అటెన్షన్ ని రాబట్టి కలిగారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా దాకా హెల్ప్ చేసింది. డైలాగ్ లు కొంచెం ఓవర్ ద టాప్ వెళ్లినప్పటికీ సిచువేషన్ కి తగ్గట్టుగా ఉన్నాయి. ఆర్టిస్టులు కూడా పాత్రలకు తగ్గట్టుగా అద్భుతంగా నటించారు. విశ్వక్సేన్ కి సపోర్ట్ గా నటించి కొన్ని సీన్లని నేహా శెట్టి ఎలివేట్ చేయడంలో సక్సెస్ అయ్యారు. నాజర్ కూడా తన పాత్రలో మెప్పించారు. విశ్వక్ పర్ఫామెన్స్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. సితార ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు అందించిన ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్ గా ఉన్నాయి.

Also read:

ప్లస్ పాయింట్స్:

విశ్వక్సేన్ నటన
కొన్ని డైలాగ్లు

మైనస్ పాయింట్లు:

కొన్ని చోట్ల డైరెక్షన్
కథ స్లోగా వెళ్లడం

రేటింగ్: 2.75/5

తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading