ఇండియన్ ప్రీమియర్ లీగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు ఏమాత్రం ప్రేక్షకుల్లో క్రేజ్ తగ్గలేదు. ఐపీఎల్ ప్రారంభమైతే చాలు అందరూ… ఆ మ్యాచ్లను చూసేందుకే ఆసక్తి చూపిస్తారు. ఇక 2023 ఐపీఎల్ సీజన్ మరో మూడు నెలల్లోనే ప్రారంభం కానుంది. అలాగే, ఈ సారి మహిళల ఐపీఎల్ కూడా ప్రారంభం కానుంది.
Advertisement
ఇది ఇలా ఉండగా, క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలం ఇవాళ జరిగింది. ముంబై వేదికగా జరుగుతున్న ఈ యాక్షన్ లో మొత్తం 409 మంది ఆటగాళ్లు తమ అదృష్టం పరీక్షించుకోనున్నారు. ఈవేలం మొదట టీమ్ ఇండియా స్టార్ ప్రేయర్ స్మృతి మందానాతో ప్రారంభమైంది. గత కొన్నేళ్లుగా అన్ని ఫార్మాట్లలో పరుగుల వర్షం కురిపిస్తున్న ఈ లెఫ్ట్ హ్యాండర్ బ్యాట్ ను దక్కించుకోవడానికి అన్ని ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి.
చివరకు రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు స్మృతిని దక్కించుకుంది. ఇందుకోసం ఏకంగా రూ.3.40 కోట్లను వెచ్చించింది. ఈ వేళంలో స్మృతి బేస్ ప్రైస్ కనీసం రూ.50 లక్షలు కాగా ముంబై ఏకంగా రెండు కోట్లకు బిడ్ చేసింది. ఇతర ఫ్రాంచైజీలు కూడా భారీ ధరను బిడ్ చేసాయి. అయితే మహిళల క్రికెట్ లో లేడీ విరాట్ గా పేరున్న స్మృతిని దక్కించుకోవడానికి బెంగళూరు ఏకంగా రూ.3.40 కోట్లు వెచ్చించింది. కాగా ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యుత్తమ టి20 బ్యాటర్లలో స్మృతి మందాన ఒకరు. ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ కు ఏకంగా 112 T20 అంతర్జాతీయ మ్యాచులు ఆడిన అనుభవం ఉంది.
Advertisement
మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) వేలం 2023లో అమ్ముడుపోయిన ఆటగాళ్లు:
1. స్మృతి మంధాన – INR 3.4 కోట్లు – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
2. హర్మన్‌ప్రీత్ కౌర్ – – INR 1.8 కోట్లు – ముంబై ఇండియన్స్
3. సోఫీ డివైన్ – INR 50 లక్షలు – RCB
4. హేలీ మాథ్యూస్ – అన్‌సోల్డ్ – INR 40 లక్షల బేస్ ధర
5. ఆష్లీ గార్డనర్ – INR 3.2 కోట్లు – గుజరాత్ జెయింట్స్
6. సోఫీ ఎక్లెస్టోన్ – INR 1.8 కోట్లు – UP వారియర్జ్
7. ఎల్లీస్ పెర్రీ – INR 1.7 కోట్లు – RCB
8. దీప్తి శర్మ – INR 2.6 కోట్లు – UP వారియర్జ్
9. రేణుకా సింగ్ – INR 1.50 కోట్లు – RCB
10. నాట్ స్కివర్-బ్రంట్ – INR 3.2 కోట్లు – MI
READ ALSO : యూట్యూబ్ నుంచి టాలీవుడ్ కు వచ్చి..ఓ రేంజ్ కు వెళ్లిన స్టార్లు వీళ్లే
It's an 18 thing, isn't it @RCBTweets ? 🤩 #WPLAuction https://t.co/Z8S966kfto pic.twitter.com/EKv0ePBBGA
— Cricbuzz (@cricbuzz) February 13, 2023