సూపర్ స్టార్ రజినీకాంత్ తమిళ తెలుగు ఇండస్ట్రీలోనే కాదు ఇండియా మొత్తం క్రేజ్ ఉన్నటువంటి స్టార్ హీరో. అలాంటి రజనీకాంత్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. అంతటి సూపర్ స్టార్ అయిన కానీ ఏనాడు కూడా తనకున్న హోదాను చూపించుకోలేదు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే మనస్తత్వం సూపర్ స్టార్ రజనీకాంత్ సొంతం అని చెప్పవచ్చు.. అలాంటి రజనీకాంత్ ఎక్కడైనా సరే ఒక సాధారణ వ్యక్తిలా మన ఇంట్లో ఉండే తాతల కనిపిస్తూ ఉంటారు.. అయితే రజనీకాంత్ కు ఒక సందర్భంలో గుడిలో తీవ్రమైన అవమానం జరిగిందట.. మరి దాని వెనుక ఉన్న అసలు కథ ఏంటో చూద్దాం..
Advertisement
ALSO READ:భార్య భర్తల మధ్య గొడవలు రాకుండా ఉండాలంటే ఈ 5 టిప్స్ పాటించండి…!
అది 2007వ సంవత్సరం రజనీకాంత్ చేసిన శివాజీ మూవీ రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఇండియాలోనే కాకుండా విదేశాల్లో కూడా చాలా పెద్ద హిట్ అయింది. దీంతో రజనీకాంత్ దైవ దర్శనానికి పోవాలని నిర్ణయించుకున్నాడు.. తనకు ఉన్నటువంటి క్రేజ్ కారణంగా గుడిలో సెక్యూరిటీ ప్రాబ్లం వస్తుందని మారువేషంలో గుడికి వెళ్లాలని అనుకున్నాడు. ఒక నలిగిన చొక్కా,తెల్లని లుంగీ కట్టుకొని తలపై గోధుమ రంగు శాలువా ధరించి గుడికి వెళ్ళాడు.. గుడి దగ్గరికి వెళ్ళగానే ఒక వృద్ధుడిలా కుంటుకుంటూ నడిచాడు. రజనీకాంత్ ను ఎవరు కూడా గుర్తుపట్టలేదు.. కానీ ఒక మధ్య వయసులో ఉన్న మహిళ నేరుగా రజనీకాంత్ వద్దకు వచ్చి పది రూపాయలు తీసి ఆయన చేతిలో పెట్టేసింది. దీంతో రజనీకాంత్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు.
Advertisement
కానీ మర్యాదపూర్వకంగానే ఆమె ఇచ్చిన RS.10 ని తీసుకొని గుడి లోపలికి వెళ్లి దర్శనం చేసుకొని హుండీలో 100 రూపాయలు వేశాడు. దీన్ని గమనించింది ఆ మహిళ. ఆ తర్వాత రజనీకాంత్ బయటకు వచ్చి ఖరీదైన కారు ఎక్కడం చూసింది.. వెంటనే వెళ్లి ఆయన్ను ఆపి నన్ను మన్నించు అంటూ వేడుకుంది. తను ఇచ్చిన ₹10 కూడా వెనక్కి ఇవ్వాలని కోరింది. దీంతో రజనీకాంత్ ఒక్క నవ్వు నవ్వుతూ ప్రతిసారి ఆ భగవంతుడు తన ముందు నేనొక బిచ్చగాడిని అని ఏదో ఒక విధంగా గుర్తు చేస్తూ ఉంటాడు.. ఆ భగవంతుడు ఆడించిన నాటకంలో మీరు, నేను సాధారణ మనుషులం అని ఆ మహిళతో అన్నాడు.. ఈ విధంగా గుడిలో జరిగిన అవమానాన్ని ఒక ఇంటర్వ్యూలో రజనీకాంత్ చెప్పుకొచ్చాడు.
ALSO READ: