Home » భ‌ర్త‌ల‌కు చెప్ప‌కుండా పుట్టింటికి వెళ్లే భార్య‌లు త‌ప్ప‌కుండా ఈ విష‌యం తెలుసుకోవాల్సిందే..!

భ‌ర్త‌ల‌కు చెప్ప‌కుండా పుట్టింటికి వెళ్లే భార్య‌లు త‌ప్ప‌కుండా ఈ విష‌యం తెలుసుకోవాల్సిందే..!

by Anji

భార్య‌లు పుట్టింటికి వెళ్ల‌డం సాధార‌ణం. పండుగ‌ల‌కు, సెల‌వుల‌కు, శుభ‌కార్యాల‌కు ఇలా మ‌హిళ‌లు పెళ్లి అయిన త‌రువాత ఏదో ఒక సంద‌ర్భంలో పుట్టింటికి వెళ్లి వ‌స్తుంటారు. అప్పుడప్పుడు భ‌ర్త‌తో గొడ‌వ‌ప‌డో లేక అత్త‌మామ‌ల‌తో వాగ్వాదం జ‌రిగే కూడా కొన్నిసార్లు పుట్టింటికి వెళ్తుంటారు. అయితే పుట్టింటికి వెళ్లేట‌ప్పుఉ భ‌ర్త అనుమ‌తి లేక అత్త‌మామ‌ల అనుమ‌తి తీసుకోవాల్సిన అవ‌స‌రం లేదు. అలా భ‌ర్త‌కు చెప్ప‌కుండా లేక అత్తింటివారి అనుమ‌తి తీసుకోకుండా మ‌హిళ‌ల‌కు పుట్టింటికి వెళ్లితే.. అదేదో నేరంగా చూసేవాళ్లు చాలా మందే ఉన్నారు. ఇదేవిధంగా ఓ భ‌ర్త కూడా త‌న భార్య త‌మ అనుమ‌తి లేకుండా పుట్టింటికి వెళ్తోంద‌ని.. కాబ‌ట్టి త‌న‌కు ఆమె నుంచి విడాకులు కావాల‌ని కోర్టుకు ఎక్కాడు. కోర్టు తీర్పుతో అత‌ని మైండ్ బ్లాక్ అయింది.

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి చెందిన మెహిత్ ప్రీత్ క‌పూర్‌-సుమిత్ క‌పూర్ భార్య‌భ‌ర్త‌లు. 2013 డిసెంబ‌ర్‌లో వీరికి పెళ్లి జ‌రిగింది. జులైలో 2017లో సుమిత్ క‌పూర్ త‌న భార్య నుంచి విడాకులు ఇప్పించాల‌ని కోరుతూ కోర్టును ఆశ్ర‌యించాడు. 2015 జ‌న‌వ‌రిలో త‌న భార్య మెహిత్ ప్రీత్ క‌పూర్ తాను, త‌న త‌ల్లిదండ్రులు ఇంట్లో లేని స‌మ‌యంలో ఎవ‌రికీ చెప్ప‌కుండా పుట్టింటికి వెళ్లిపోయింద‌ని.. ఎలాంటి కార‌ణం లేకుండా త‌న భార్య పుట్టింటికి వెళ్లిపోయింద‌ని, ఆమె నుంచి విడాకులు కావాల‌ని పిటిష‌న్‌లో పేర్కొన్నాడు. ఇంటికి రావాల‌ని ఎన్నిసార్లు కోరినా ఆమె నిరాక‌రించింద‌ని.. త‌మ ఇంటి వ‌ద్ద ఉన్న‌ప్పుడు ఇంటి ప‌ని కూడా చేసేందుకు త‌న భార్య నిరాక‌రించేద‌ని.. అత్త‌మామ‌ల‌తో స‌రిగ్గా ప్ర‌వ‌ర్తించేది కాద‌ని పిటిష‌న్‌లో పేర్కొన్నాడు.

ఇక ఇదే స‌మ‌యంలో హిందూ వివాహ చ‌ట్టంలోని సెక్ష‌న్ 24 కింద భ‌ర్త నుండి భ‌ర‌ణం కోరుతూ సెప్టెంబ‌ర్ 2017లో కోర్టును ఆశ్ర‌యించింది మెహిత్ ప్రీత్. నెల‌వారి ఖ‌ర్చుల కింద భ‌ర్త త‌న‌కు రూ.5వేలు ఇవ్వాల‌ని.. త‌న కూతురి ఖ‌ర్చుల‌కు రూ.2వేలు ఇవ్వాల‌ని తెలిపింది. జులై 2016లో త‌న కుమార్తెతో పాటు త‌న‌ను అత్తింటి వారు ఇంట్లో నుంచి పంపించార‌ని వెల్ల‌డించింది. ఈ కేసు విచార‌ణ చేప‌ట్టిన అల‌హాబాద్ హైకోర్టు జ‌న‌వ‌రి 01, 2015న భ‌ర్త ఇంట్లో లేని స‌మ‌యంలో కేవ‌లం 400 మీట‌ర్ల దూరంలో ఉన్న‌టువ‌టి త‌న పుట్టింటికి మోహిత్ ప్రీత్ కౌర్ వెళ్లింది. ఆ స‌మ‌యంలో మోహిత్ గ‌ర్భ‌వ‌తి అని, త‌ల్లిదండ్రుల స్వాంత‌న కోసం పుట్టింటికి వెళ్లి ఉండ‌వ‌చ్చ‌ని వెల్ల‌డించింది. అంతేకాదు మెహిత్ ప్రీత్ త‌న భ‌ర్త, కుటుంబ స‌భ్యుల స‌మ్మ‌తి లేకుండా త‌న త‌ల్లిదండ్రుల ఇంటికి త‌రుచుగా వెళ్ల‌డం నేరం కాద‌ని కోర్టు స్ప‌ష్టం చేసింది.

జ‌న‌వ‌రి 01, 2015న తొలిసారి, జ‌న‌వ‌రి 15, 2017 చివ‌రగా ఆరోపించబ‌డిన చ‌ర్య‌కు గ‌ల కార‌ణం సేక‌రించ‌బ‌డింద‌ని కోర్టు నిర్థారించింది. రెండు సంవ‌త్స‌రాలు విడిచిపెట్టిన కాలం, రికార్డులో ఉన్న అంశాల నుంచి నిరూపించ‌బ‌డ‌లేదు. భార్య ప్ర‌స‌వ స‌మ‌యంలో భ‌ర్త ఆసుప‌త్రిలో చేర్పించార‌ని, చికిత్స కోసం ఖ‌ర్చులు భ‌రించాడ‌ని కోర్టు గుర్తించింది. భ‌ర్త‌తో క‌లిసి ఉండాల‌నే ఉద్దేశంతో ఆమె త‌న భ‌ర్త‌ను శాశ్వ‌తంగా విడిచిపెట్ట‌లేద‌ని కేసుకు ఈ వాస్త‌వాలు రుజువు చేస్తున్నాయ‌ని కోర్టు స్ప‌ష్టం చేసింది. పుట్టిన బిడ్డ‌ను తండ్రికి ఆమె ఎప్పుడూ దూరం చేయ‌లేదు అని వెల్ల‌డించింది. ట్ర‌య‌ల్ కోర్టు మంజూరు చేసిన విడాకుల‌ను ప‌క్క‌న బెట్టి భ‌ర్త సుమిత్ నెల‌కు రూ.3వేలు త‌న కూతురు మెయింటెనెన్స్ కోసం చెల్లించాల‌ని కోర్టు ఆదేశించింది. కోర్టు తీర్పుతో సుమిత్ ఏమి చేయాలో అర్థం కాక అయోమ‌యంలో ప‌డ్డాడు.

Also Read : 

ఈ ఫోటోలో ఉన్న మెగాస్టార్‌ను మీరు గుర్తు ప‌ట్టారా..? సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌

సుకుమార్ భార్య పోస్ట్‌.. మ‌న పెళ్లి స‌క్సెస్ కావ‌డానికి కార‌ణం అదే అంటూ..!

 

Visitors Are Also Reading