Ad
గత ఏడాది యూఏఈ వేదికగా బీసీసీఐ నిర్వహించిన ఐసీసీ టీ20 ప్రపంచ కప్ టోర్నీలో టీం ఇండియా ఘోరంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. కనీసం సెమీస్ కు కూడా చేరుకోలేకపోయింది. ఈ క్రమంలోనే ఈ ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరిగే టోర్నీలో రాణించాలని బీసీసీఐ భావిస్తుంది. అందుకు తగినట్లుగానే ఇప్పుడు ప్రతి ఒక్క ఆటగాడికి అవకాశాలు కల్పిస్తూ.. ఎవరి ప్రతిభ ఏంటి అనే విషయాన్ని గమనిస్తుంది. ఈ మధ్య జట్టులోకి ఎక్కువ మంది యువ ఆటగాళ్లు రావడానికి కూడా ఇదే కారణం.
అయితే ఈ ఏడాది ఐపీఎల్ 2022 లో రాణించిన జమ్మూ ఆటగాడు ఉమ్రాన్ మాలిక్ గురించి పెద్ద చర్చలు జరుగుతున్నాయి. ఐపీఎల్ లో అతని బౌలింగ్ చూసి చాలామంది నేరుగా ప్రపంచ కప్ లోక్ తీసుకోవాలని సూచించారు. అయితే బీసీసీఐ గత నెలలో ఐర్లాండ్ కు వెళ్లిన రెండో టీం ఇండియాలో ఉమ్రాన్ కు చోటు కల్పించింది. కానీ అక్కడ అనుకున్న విధంగా ఉమ్రాన్ బౌలింగ్ చేయలేదు. అతని స్పీడ్ కూడా అంతగా పడలేదు. ఈ క్రమంలో ఉమ్రాన్ ప్రపంచ కప్ జట్టులో ఉంటాడా.. లేదా అనే విషయం పై టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ క్లారిటీ ఇచ్చాడు.
తాజాగా ఇంగ్లాండ్ లో ప్రెస్ తో రోహిత్ మాట్లాడుతూ… నేను ఇప్పుడు కరోనా నుండి పూర్తిగా కోలుకున్నాను. అందుకే టీ20 సిరీస్ లో ఆడాలని నిర్ణయించుకున్నాను. అయితే ఈ టీ20 సిరీస్ జట్టులో చాలా మంది యువ ఆటగాళ్లు ఉన్నారు. ముఖ్యంగా మేము ఉమ్రాన్ ఆటను పరిశీలిస్తున్నం. అయితే జట్టుకు ఏం అవసరం అనేది అతనికి తెలుసు. మేము ఇప్పుడు ప్రపంచ కప్ కోసం జట్టును తాయారు చేసే పనిలో ఉన్నం. అందుకే అందరికి అవకాశాలు ఇస్తున్నాము. ఉమ్రాన్ ఇప లో బాగా బౌలింగ్ చేసాడు. అందుకే అతనికి అవకాశం ఇవ్వడంలో తప్పు లేదు. అయితే లీగ్ క్రికెట్ కు ఇంటర్నేషనల్ క్రికెట్ కు చాలా తేడా అనేది ఉంటుంది అని రోహిత్ పేర్కొన్నాడు.
ఇవి కూడా చదవండి :
దారుణంగా కోహ్లీ పరిస్థితి.. 6 ఏళ్ల తర్వాత మళ్ళీ..?
కోహ్లీని అవమానించిన బాబర్.. ”ఏ రికార్డ్”..?
Advertisement