Home » దారుణంగా కోహ్లీ పరిస్థితి.. 6 ఏళ్ల తర్వాత మళ్ళీ..?

దారుణంగా కోహ్లీ పరిస్థితి.. 6 ఏళ్ల తర్వాత మళ్ళీ..?

by Azhar

విరాట్ కోహ్లీ పరిస్థితి ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్ లో దారుణంగా తయారైంది. సెంచరీ లేకుండానే మూడేళ్ళుగా ఉంటున్న కోహ్లీ ఇప్పుడు మరో స్థానం పడిపోయాడు. అయితే ఇన్ని రోజులు కోహ్లీ సెంచరీ చేయకున్నా అర్ధ శతకాలతో రాణించాడు. కానీ ఐపీఎల్ 2022 ముగిసిన తర్వాత విశ్రాంతి తీసుకొని వచ్చిన విరాట్ కోహ్లీ ఇంగ్లాండ్ లో దారుణంగా విఫలమయ్యాడు. కనీసం హాఫ్ సెంచరీ దగ్గరకు కూడా వెళ్లలేకపోయాడు విరాట్ కోహ్లీ, అయితే ఈ టెస్ట్ మ్యాచ్ ముగిసిన తర్వాత ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ అనేవి వచ్చాయి. ఇందులో విరాట్ కోహ్లీ నాలుగు స్థానాలు పడిపోయాడు.

అయితే ఇంతకముందు టాప్ 10 లో 9వ స్థానంలో నిలిచినా విరాట్.. ఇప్పుడు ఏకంగా నాలుగు స్థానాలు కోల్పోవడంతో 13వ స్థానానికి వచ్చాడు. దాంతో విరాట్ కోహ్లీ ఆరు ఏళ్ల తర్వాత టాప్ 10 లో చోటు కోల్పోయాడు. 2016 లో ఆఖరిసారిగా కోహ్లీ 10వ స్థానం కంటే కింద ఉన్నాడు. కానీ అప్పటి నుండి మళ్ళీ ఇప్పటివరకు టెస్ట్ లో టాప్ లో ఉండే విరాట్ ఇప్పుడు పడిపోయాడు. అయితే తన స్థానాన్ని మళ్ళీ టాప్ 10 లోకి తెచ్చుకోవాలంటే ఈ ఏడాది సెప్టెంబర్ లో ప్రారంభం అయ్యే ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ వరకు కోహ్లీ ఆగాల్సింది.

అయితే కోహ్లీ లేకపోయినా ఇప్పుడు టాప్ 10 లో ఇద్దరు భారత బ్యాటర్లు ఉన్నారు. భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ 5 స్థానాలు ఎగబాకి 801 పాయింట్లతో 5వ స్థానంలో నిలవగా.. టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఈ మ్యాచ్ ఆడకపోవడంతో ఒక్క స్థానం పడిపోయి 9వ స్థానానికి పరిమితం అయ్యాడు. అయితే ఈ ర్యాంకింగ్స్ లో 923 పాయింట్లతో మాజీ సారథి జో రూట్ మొదటి స్థానంలో నిలిచాడు. ఆ తర్వాత 879 పాయింట్లతో మార్నస్ లబూషేన్ , 826 పాయింట్లతో స్టీవ్ స్మిత్, 815 పాయింట్లతో బాబర్ ఆజమ్ వరుసగా 2, 3, 4 స్థానాల్లో నిలిచారు.

ఇవి కూడా చదవండి :

కోహ్లీని అవమానించిన బాబర్.. ”ఏ రికార్డ్”..?

ఇండియా పరాజయానికి కారణాలు ఇవేనా..?

Visitors Are Also Reading