నందమూరి తారకరత్న ఇప్పటికీ ఆయన మరణం ప్రతి ఒక్క అభిమానిని కుటుంబ సభ్యులను కన్నీటి పర్యంతం చేస్తూనే ఉంది. బ్రతుకుతాడని ప్రతి ఒక్కరూ భావించారు. కానీ ఆయన అనూహ్యంగా మృతి చెందడం జీర్ణించుకోలేకపోతున్నారు. అలాంటి తారకరత్న యువగలం పాదయాత్రలో పాల్గొని గుండెపోటుకు గురై నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో 23 రోజులు చికిత్స పొంది సరిగ్గా శివరాత్రి పర్వదినాన పరమపదించారు. అలాంటి శుభదినాన ఆయన మరణించారు కాబట్టి తారకరత్నకు కచ్చితంగా మరో జన్మ ఉంటుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.. మరి ఇందులో నిజానిజాలు ఏంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
23 రోజులుగా ప్రాణాలతో పోరాడి శివరాత్రి పర్వదినాన ప్రాణాలు విడిచారు అంటే ఆయనకు తప్పనిసరిగా శివుని అనుగ్రహం ఉందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. శివరాత్రి పర్వదినాన మరణించాలి అంటే ఎన్నో జన్మల పుణ్యమని అలాంటి పుణ్యఫలాలు పొందితేనే తారకరత్న ఆరోజు మరణించారని ఆయన తెలియజేస్తున్నారు. మనిషి మరణం అనేది సహజంగా వస్తుంది కానీ కొంతమంది మరణం కొన్ని ప్రత్యేకమైన తిధులు, నక్షత్రాలలో సంభవించడం అంటే అది కారణజన్ములకే సాధ్యమవుతుందని, ముఖ్యంగా తారకరత్న కారణజన్ముడని చెప్పవచ్చు.
Advertisement
Advertisement
ముఖ్యంగా శివరాత్రి రోజు చనిపోతే శివైక్యం చెందారని అంటుంటారు. సాక్షాత్తు పరమేశ్వరుడు ఉద్భవించిన కాలమే మహాశివరాత్రి, అలాంటి పర్వదినాన శివైక్యం చెందారు అంటే కచ్చితంగా తారకరత్న ఆత్మ శాంతించి కైలాసంలో సుభిక్షంగా పరమశివుడి అనుగ్రహం లభించిందని జ్యోతిష్య పండితులు అంటున్నారు. కాబట్టి తారకరత్నకు మరో జన్మ ఉంటుందని వారు తెలియజేస్తున్నారు. ఏది ఏమైనా తారకరత్న అకాల మరణం వారి కుటుంబాన్ని పిల్లలను, అనాధల్ని చేసింది అని చెప్పవచ్చు. అలాంటి నందమూరి తారకరత్న ఆత్మ శాంతి చేకూరాలని కోరుకుందాం..
also read: