టాలీవుడ్ లో ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి యంగ్ హీరోయిన్లలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు శ్రీలీల. పెళ్లి సందడి మూవీతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయినా శ్రీలీల తన నటనతో దర్శకుల కంట్లో పడింది. ఈ మూవీ తరువాత మాస్ మహారాజా రవితేజతో ధమాకా సినిమాలో చేసి సూపర్ హిట్ అందుకుంది. ఈ సినిమాలో ఆమె డ్యాన్స్ చూసి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.
Advertisement
ఈ చిత్రం తరువాత బాలయ్య.. నితిన్, మహేష్ బాబు వంటి స్టార్ హీరోలు అందరితో సినిమాల్లో నటిస్తోంది. భగవంత్ కేసరి మూవీతో మనముందుకు రాబోతుంది ఈ అమ్ముడు. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బాలయ్య కుమారుడు మోక్షజ్ఞతో ఓ ఫొటోలో కనిపించింది శ్రీలీల. దీంతో ఈమెపై రకరకాల రూమర్స్ వినిపించాయి. బాలకృష్ణ కొడుకు శ్రీలీలతో పెళ్లి చేయాలని అంటున్నారని.. వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
Advertisement
ఇక ఈ వార్తలపై స్పందించిన శ్రీలీల చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నట్టు కూడా సమాచారం. కేవలం ఇవన్నీ రూమర్స్ మాత్రమే.. ఎవరో కావాలని రూమర్స్ క్రియేట్ చేశారని.. ఈ వార్త వాస్తవం కాదని క్లారిటీ ఇచ్చేసింది శ్రీలీల. ముఖ్యంగా ఇలాంటి వార్తలు రాసేటప్పుడు ఇందులో వాస్తవం ఎంత..? అబద్ధం ఎంతో తప్పనిసరిగ్గా తెలుసుకోవాలని కూడా సలహా ఇచ్చిందట శ్రీలీల. ఇక శ్రీలీల నటించిన భగవంత్ కేసరీ మూవీ అక్టోబర్ 19న విడుదలయ్యేందుకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం అటు బాలయ్యకి, ఇటు శ్రీలీల ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో వేచి చూడాలి మరీ.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
అమితాబ్ బచ్చన్ ని ఏడ్చేలా చేసిన చిరంజీవి… అసలేం జరిగిందంటే..?