సాధారణంగా సినీ ఇండస్ట్రీలో నిత్యం ఏదో ఒక సెంటిమెంట్ చోటు చేసుకుంటూనే ఉంటుంది. సినిమాలు విడుదలవుతున్నాయంటే ఆ సెంటిమెంట్ తో ఆ సినిమా హిట్ అవుతుందా..? ఫట్ అవుతుందా అనే అనుమానాలను వ్యక్తం చేస్తుంటారు. తెలుగు సినీ ఇండస్ట్రీలో అయితే అసలు సెంటిమెంట్లకు కొదవనేలేదు. సినిమా ప్రారంభించినప్పటి నుంచి విడుదల అయ్యేంతవరకు ముహూర్తాలను ఫాలో అవుతుంటారు. అభిమానులు కూడా ఈ సెంటిమెంట్ ఫై ఫోకస్ చేస్తుంటారు. ఆ బ్లాక్ బస్టర్ డేట్ కి తన అభిమాన హీరో సినిమా విడుదల అవుతుందంటే ఎంత సంతోషపడతారో.. గతంలో ప్లాప్స్ పడిన నెలలోనే తమ అభిమాన హీరో సినిమా రిలీజ్ అవుతుంది అంటే భయపడుతుంటారు.
ఈ విషయంపై సోషల్ మీడియాలో రకరకాలుగా చర్చించుకోవడం విశేషం. సెంటిమెంట్లతో కూడుకున్న ఓ డిస్కషన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ నడుస్తోంది. ముఖ్యంగా నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి, మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాలు ఈ సంక్రాంతి పండుగకు విడుదల అవుతున్న విషయం తెలిసిందే.జనవరి 11న వీరసింహారెడ్డి, జనవరి 12న వాల్తేరు వీరయ్య సినిమాలు విడుదలవుతున్నాయి. అయితే తాజాగా రవితేజ గురించి ఓ డిస్కషన్ మొదలైంది. అది ఏంటంటే..? ప్రధానంగా బాలయ్య, రవితేజ సినిమాలు ఒకే సమయంలో విడుదలయితే బాలయ్య సినిమాలు ప్లాప్ అవుతాయనే సెంటిమెంట్ కొనసాగుతుంది.
Advertisement
Advertisement
బాలయ్య నటించిన ఒక్క మగాడు సినిమా విడుదలైన సమయంలో రవితేజ నటించిన కృష్ణ సూపర్ హిట్ అయింది. అదేవిధంగా బాలకృష్ణ మిత్రుడు విడుదలైన సమయంలో రవితేజ కిక్ చిత్రం సూపర్ హిట్ సాధించింది. ఇక వాల్తేరు వీరయ్య లో కూడా రవితేజ నటించాడు కాబట్టి వీరసింహారెడ్డి సినిమా కూడా ఫ్లాప్ అవుతుందనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మరోవైపు వీరసింహారెడ్డి సినిమాకే హిట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉందని బాలయ్య అభిమానులు పేర్కొంటున్నారు. రవితేజ, బాలయ్య సెంటిమెంట్ రిపీట్ అవుతుందా..? లేక వీరసింహారెడ్డి సినిమా సూపర్ హిట్ అవుతుందా అనేది తెలియాలంటే మాత్రం జనవరి 12 వరకు వేచి ఉండాల్సిందే.
Also Read : వాల్తేరువీరయ్య ట్రైలర్ లో ఉన్నటువంటి ఈ 5 మైనస్ లను మీరు గమనించారా..?