సాధారణంగా సినీ ఇండస్ట్రీలో రకరకాల సినిమాలు విడుదలవుతుంటాయి. ఈ క్రమంలోనే ఎప్పటికప్పుడూ కొత్త డైరెక్టర్లు సినిమా హీరోలు, హీరోయిన్ ఇండస్ట్రీకి చాలా ఇస్తూనే ఉంటారు. ఈ మధ్యకాలంలో కొత్త డైరెక్టర్లు స్టార్ హీరోలతోనే సినిమా అవకాశాలను అందుకుంటూ వారి అదృష్టాన్నిపరీక్షీంచుకుంటుంటారు. ఇదిలా ఉండగా.. సాధారణంగా అయితే ఒక చిత్రానికి ఒకరు లేదా ఇద్దరూ దర్శకులుంటారు. ఎక్కువగా అయితే సినిమాకి ఒకే దర్శకుడు మాత్రమే ఉంటారని చెప్పవచ్చు. నిర్మాతలయితే.. కనీసం ఒక ఇద్దరూ ముగ్గురూ ఉన్న ఆశ్చర్యపోనవసం లేదు. తొలిసారిగా ఒకే సినిమాతో ఏకంగా నలుగురు దర్శకులు పరిచయం కాబోతున్నారు. ఆ సినిమా ఏది… ఆ దర్శకులు ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Also Read : పెరిగిన ఎన్టీఆర్ ఆస్తుల విలువ.. 2023 లెక్కల ప్రకారం ఎంతో తెలుసా ?
Advertisement
అమెరికాలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా నిర్మిస్తున్న చిత్రం “మూడో కన్ను”. ఈ చిత్రాన్ని సెవెన్ స్టార్ క్రియేషన్స్ ఆడియన్స్ పల్స్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ ద్వారా సునిత రాజేందర్, ప్లాన్ బి దర్శకుడు కె.వి రాజమహి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో సూరత్ రాంబాబు, కె.బ్రహ్మయ్య ఆచార్య, కృష్ణ మోహన్, మావిటి సాయి సురేంద్ర బాబులు దర్శకులుగా పరిచయం కాబోతున్నారు. ఇకపోతే ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించిన సాయికుమార్ మాట్లాడుతూ.. కొత్త కథతో వస్తున్న కొత్త వాళ్లను ఎంకరేజ్ చేయడానికి ఈ చిత్రం చేస్తున్నానని.. ఈ చిత్రం చేయడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.
Advertisement
Also Read : Naresh- Pavitra : పెళ్లి చేసుకున్న నరేష్, పవిత్ర… వీడియో రిలీజ్
ఇక తెలుగు ఫిలిం దర్శకుల సంఘం అధ్యక్షుల కాశీ విశ్వనాథ్ మాట్లాడుతూ.. తొలిసారి తెలుగు ఫిలిం ఇడస్ట్రీ చరిత్రలో మా యూనియన్ మెంబర్ షిప్ ఉన్న నలుగురు కొత్త దర్శకులను పరిచయం చేస్తున్న మా మెంబర్ దర్శకుడు కె.వి.రాజమహికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ చిత్రంలో తాను కూడా భాగమైనందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ చిత్రంలో సూర్య, మహేష్ వడ్డి, నిరోష, కౌశిక్ రెడ్డి, ప్రదీప్ రుద్ర, దయానంద రెడ్డి, శశిధర్ కౌసరి, దేవీ ప్రసాద్, చిత్రం శ్రీను, మాధవిలత, సత్యశ్రీ, దివ్య, మధు, వీర శంకర్, రూప తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి కథ, కథనం, మాటలు కె.వి. రాజమహి అందించారు.
Also Read : శ్రీ రెడ్డికి ఎప్పుడో పెళ్లయింది… భర్త ఎవరో తెలుసా?