Home » నాగ చైతన్య సినిమా కి సాయి పల్లవి రెమ్యూనరేషన్ అంత తీసుకుంటుందా..?

నాగ చైతన్య సినిమా కి సాయి పల్లవి రెమ్యూనరేషన్ అంత తీసుకుంటుందా..?

by Anji
Ad

నాగ చైతన్య హీరోగా, చందు మొండేటి దర్శకత్వంలో ఒక సినిమా రాబోతున్న విషయం అందరికీ తెలిసిందే. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో అల్లు అరవింద్, బన్నీ వాసు ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాలో నాగచైతన్య సరసన సాయి పల్లవి హీరోయిన్ గా చేస్తున్నట్టు ఇటీవలనే ప్రకటించారు. అయితే ఈ సినిమాకు సంబంధించి.. ప్రస్తుతం సాయి పల్లవి రెమ్యునరేషన్ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.


వివరాల్లోకి వెళ్తే.. హీరోయిన్ సాయి పల్లవి గత కొద్ది రోజులుగా సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఇటీవల కాలంలో ఆమె చేస్తున్న సినిమాలేవి బాక్స్ ఆఫీస్ వద్ద సరిగ్గా ఆడకపోతుండటంతో ఆమె ఈ నిర్ణయం తీసుకుంది. నిన్న, మొన్నటి వరకు ఆమె చేతిలో తమిళ్ హీరో శివ కార్తికేయన్ సినిమా తప్ప వేరే సినిమాలేవి లేవు. ఇక లేటెస్ట్ గా ఆమె కమిట్ అయిన నాగ చైతన్య సినిమా కోసం సాయి పల్లవి కి బారీ రెమ్యూనరేషన్ ముట్ట చెప్పబోతున్నారట ప్రొడ్యూసర్స్. ఇన్సైడ్ సమాచారం ప్రకారం ఆమె రెగ్యులర్ గా తీసుకునే రెమ్యూనరేషన్ కంటే కూడా 40% ఎక్కువ మొత్తంలో పారితోషికం అందుకోనుందట.

Advertisement

Advertisement


అయితే మొదటగా నాగ చైతన్యతో సినిమా కోసం హీరోయిన్ కీర్తి సురేష్ ను అనుకున్నారట. కానీ కీర్తి సురేష్ తమిళ  సినిమాలలో బిజీగా ఉండటంతో నాగ చైతన్యతో సినిమా చేయడానికి డేట్స్ కుదరకపోవడం వల్ల ఆమె ఈ సినిమాను రిజెక్ట్ చేసింది. దీంతో ఈ ఆఫర్ దొరకదేమో అనుకున్నాడో డైరెక్టర్ గాని.. మొత్తానికి సాయి పల్లవి అడిగినంత రెమ్యునరేషన్ ఇవ్వడానికి మాత్రం రెడీ అయ్యారు ప్రొడ్యూసర్స్. అయితే సాయి పల్లవి కెరీర్ లోనే ఆమె అందుకుంటున్న హైయెస్ట్ రెమ్యునరేషన్ ఇదే నట. రోజు రోజుకు అంచనాలను పెంచేస్తున్న ఈ సినిమా ప్రేక్షకులను ఎంత మాత్రం అలరిస్తుందో చూడాలి.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

చిరంజీవిని బ్లాక్ మెయిల్ చేసిన చరణ్…అలా చేస్తే నేను చచ్చిపోతానంటూ !!

Akhil Akkineni : అఖిల్ కోసం వస్తున్న రాజమౌళి.. ఈ సారైనా హిట్‌ కొడతారా ?

Visitors Are Also Reading