Home » RRR రికార్డ్స్ ని ప్రభాస్ ‘సలార్’ క్రాస్ చేస్తుందా..?

RRR రికార్డ్స్ ని ప్రభాస్ ‘సలార్’ క్రాస్ చేస్తుందా..?

by Anji
Ad

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో భారీబడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం సలార్. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయి చాలా కాలం అవుతున్నప్పటికీ ఆ మధ్య రిలీజ్ చేసిన గ్లింప్స్ తప్ప ఎలాంటి అప్డేట్ రాకపోవడంతో ప్రభాస్ అభిమానులు ఈ చిత్ర యూనిట్ పై కాస్త ఆగ్రహంగానే ఉన్నారు. వాస్తవానికి సెప్టెంబర్ 28న రిలీజ్ అవుతుందని భావించిన ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఆలస్యం కావడంతో మళ్లీ పోస్ట్ పోన్ అయింది. 

Advertisement

రిలీజ్ పోస్ట్ పోన్ అయిన విషయం అఫీషియల్ గానే కాకుండా సోషల్ మీడియాలో ప్రచారండ జరగడంతో కొంత గందరగోళం నెలకొంది. ఇటీవలే డిసెంబర్ 22న ఈ మూవీ విడుదలవుతుందని అఫీషియల్ గా అనౌన్స్ మెంట్ రావడంతో గందరగోళానికి తెరపడింది. ఈ సినిమా విడుదల తేదీ ప్రకటించినప్పటి నుంచి తారా స్థాయిలో అంచనాలు నెలకొన్న ఈ సినిమా కూడా అదే రేంజ్లో జరిగిందని సమాచారం అందుతోంది.  కేవలం ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే సలార్ మూవీకి దాదాపు రూ.180 కోట్ల వరకు బిజినెస్ జరిగినట్టు తెలుస్తోంది. ఈ రేంజ్ లో బిజినెస్ జరిగితే బ్రేక్ ఈవెన్ అవ్వడం కోసం రూ.300 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టాల్సిన పరిస్థితి ఉంటుంది.

Advertisement

ఇక ఈ సినిమాకి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వస్తే.. RRR  రికార్డులను క్రాస్ చేయడం ఖాయం అని తెలుస్తోంది.  బాహుబలి తరువాత ప్రభాస్ సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ వంటి సినిమాలు వచ్చినప్పటికీ ఈ సినిమాలన్ని కూడా డిజాస్టర్ గానే మిగిలాయి. ఈ నేపథ్యంలో సలార్ మూవీ హిట్ అవ్వడం చాలా కీలకంగా మారింది. సలార్ మూవీకి కేజీఎఫ్ స్టోరీతో లింక్ ఉందనే వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో  ఈ సినిమా పై మరింత ఆసక్తి పెరిగింది. ప్రశాంత్ యూనివర్స్ లో భాగంగా రూపొందుతున్న సలార్ మూవీ ద్వారా అయినా ప్రభాస్ కి మరో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ దక్కుతుందో లేదో వేచి చూడాలి మరీ.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ చూడండి ! తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చూడండి.

Visitors Are Also Reading