ప్రపంచంలో ఉన్న అన్ని క్రికెట్ బోర్డు కంటే మన బీసీసీఐ చాలా ధనవంతమైన బోర్డు అనే విషయం తెలిసిందే. ఎంతలా అంటే ప్రపంచ క్రికెట్ ను నడిపించే ఐసీసీని కూడా మన బీసీసీఐ కంట్రోల్ చేయగలదు. ఐసీసీకి వచ్చే ఆదాయంలో 70 శాతం కేవలం బీసీసీఐ మాత్రమే ఇస్తుంది. కాబట్టి అటువంటి బీసీసీఐకి అధ్యక్షుడిగా ఉండే వ్యక్తి చాలా నైపుణ్యం అనేది ఉండాలి. అయితే ఇప్పుడు మన బుక్ ప్రెసిడెంట్ గా సౌరవ్ గంగూలీ ఉన్నాడు.
Advertisement
అయితే సౌరవ్ గంగూలీ గతంలో భారత జట్టును సమర్ధవంతంగా నడిపాడు. కాబట్టి ఆయన నైపుణ్యం పైన ఎవరికీ అనుమానాలు అనేవి లేవు. అయితే తాజాగా సుప్రీం కోర్టు బీసీసీఐ యొక్క కూలింగ్ పిరియడ్ నియమాన్ని మార్చింది కాబట్టి మల్లి గంగూలీనే ప్రెసిడెంట్ అవుతాడు అని అందరూ అనుకున్నారు. కానీ బీసీసీఐ సెక్రెటరీగా ఉన్న జై షా గంగూలీ పోస్ట్ కు ఎసరు పెడుతున్నట్లు తెలుస్తుంది.
Advertisement
అయితే బీసీసీఐ అధ్యక్ష పదవికి వచ్చే ఏడాది ఎన్నికలు రానున్నాయి. కాబట్టి ఈ ఎన్నికలో జై షా ప్రెసిడెంట్ పదవికి పోటీ చేయనున్నాడు అని తెలుస్తుంది. అలాగే 15 రాష్ట్రాల బోర్డులు కూడా జై షాకు తమ మద్దతు అనేవి తెలుపుతున్నట్లు తెలుస్తుంది. అదే నిజం అయితే వచ్చే ఎన్నికలో గంగూలీ బీసీసీఐ అధ్యక్ష పదవి పోవడం ఖాయం. మరి ఈ సమయంలో దాదా ఐసీసీ ప్రెసిడెంట్ గా వెళ్తాడా.. లేదా అనేది చూడాలి.
ఇవి కూడా చదవండి :