జబర్దస్త్ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఫిబ్రవరి 07, 2013న ప్రారంభంమైన ఈ షో నేటితో 10 ఏళ్లు పూర్తి చేసుకుంది. ప్రారంభంలో జబర్దస్త్ షోకి యాంకర్ గాఅనసూయ వ్యవహరించారు.. జడ్జీలుగా నాగబాబు, రోజా వ్యవహరించారు. ఈ మధ్యకాలంలో జడ్జీలు, యాంకర్లు మారుతూనే ఉన్నారు. జబర్దస్త్ షో గురించి తరచూ ఏదో ఓ వార్త వినిపిస్తూనే ఉంది. ప్రధానంగా జబర్దస్త్ షోకి సంబంధించి రేటింగ్ తగ్గిందని.. గతంతో పోల్చితే దారుణమైన రేటింగ్ నమోదు అవుతుందనే విషయం అందరికీ తెలిసిందే. మరోవైపు కమెడీయన్స్ ఒకరి వెనుక ఒకరు వెళ్లిపోతూనే ఉన్నారు. మరో వైపు కొత్త వారు కూడా వస్తూనే ఉన్నారు.
Advertisement
జడ్జీలలో కొందరూ విభేదాల కారణంగా వెళ్లితే.. మరొకొందరూ కొన్ని కారణాల వల్ల వెళ్లిపోతున్నారు. యాంకర్స్ కూడా మారుతూనే ఉన్నారు. జబర్దస్త్ షో ప్రారంభించినప్పుడు యాంకర్ గా వ్యవహరించిన అనసూయ.. మధ్యలో చిన్న గ్యాప్ ఇచ్చి 2022 చివరి నెల వరకు యాంకర్ గా వ్యవహరించింది. ఆమె తప్పుకోవడంతో ఆ స్థానంలో కన్నడ బ్యూటీ సౌమ్యరావు ఎంట్రీ ఇచ్చింది. వచ్చి రాని తెలుగుతో సౌమ్య జబర్దస్త్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటుంది. అనసూయ, రష్మీగౌతమ్ కి ఏమాత్రం తక్కువ కాకుండా అందాల ఆరబోత చేస్తూ.. తనదైన శైలిలో నడిపిస్తూ ముందుకెళ్తుంది. ఇప్పటికీ కూడా ఆమె షోలో కనిపిస్తూనే ఉంది. ప్రస్తుతం ఆమె గురించి సోషల్ మీడియాలో రకరకాలు వార్తలు వినిపిస్తున్నాయి.
Advertisement
ముఖ్యంగా సౌమ్యకి పెళ్లి అయిందా.. లేదా అనే విషయంపై చాలా మందికి క్లారిటీ లేదు. ఆ విషయాన్ని ఆమె కూడా ఎప్పుడూ అధికారికంగా వెల్లడించలేదు. ఇదే సమయంలో సౌమ్య తల్లి కాబోతుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. గతంలో యాంకర్ అనసూయ ఎలాగైతే గర్భవతి అయినప్పుడు జబర్దస్త్ కి గ్యాప్ ఇచ్చిందో ఇప్పుడు సౌమ్య కూడా గ్యాప్ ఇవ్వనున్నట్టు సమాచారం. ఇక ఈ గ్యాప్ లో యాంకర్ రష్మీ గౌతమ్ రెండు కార్యక్రమాలకు యాంకరింగ్ చేయబోతుందని ప్రచారం జరుగుతోంది. ఇక విషయం విషయం ఏంటి అనేది అధికారికంగా ఓ క్లారిటీ ఇస్తే కానీ తెలియదు.
Also Read : ప్రభాస్ కు అనారోగ్యం…ఆ సినిమాల షూటింగ్స్ అన్నీ క్యాన్సిల్…?