వికీలిక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంబే తన ప్రేయసి స్టెల్లా మోరిస్‌ను పెళ్లి చేసుకున్నారు. బుధవారం లండన్‌లోని హై సెక్యూరిటీ జైలులో వీరి వివాహం జరిగింది. టాప్ బ్రిటీష్ ఫ్యాషన్ డిజైనర్ వివియెన్ వెస్ట్‌వుడ్ మోరిస్ వివాహ దుస్తులను అసాంజే కోసం కిల్ట్‌ను డిజైన్ చేసినట్టు పేర్కొంది.
2021 నవంబర్‌లో ఈ జంట నిశ్చితార్థం చేసుకున్నారు. అసాంజే జైలులో ఉన్న కారణంగా వాయిదా పడింది. చివరికీ గవర్నర్, జైలు ఉన్నతాధికారుల ప్రత్యేక అనుమతితో జైలులోనే పెళ్లి చేసుకున్నారు. జైలులో నలుగురు అతిథులు, ఇద్దరు అధికారిక సాక్షులతో పాటు ఇద్దరూ సెక్యూరిటీ గార్డుల మధ్య విజిటింగ్ హవర్స్ సమయంలో ఈ వేడుక జరిగింది.
Advertisement
Advertisement
అసాంజే వికీలీక్స్ యూఎస్ మిలిటరీ రికార్డులు, దౌత్య అంశాల విడుదలకు సంబంధించి విచారణను ఎదుర్కొంటున్నారు. అసాంజే 2019 నుంచి బెల్మార్ట్ జైలులో ఉన్న విషయం తెలిసినదే. దీనికి ముందు లండన్‌లోని ఈక్వెడార్ రాయబార కార్యాలయంలో 7 సంవత్సరాలున్నారు. అక్కడ నివసిస్తున్న సమయంలోనే అసాంజే తన న్యాయవాది మోరిస్‌తో కలిసి ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు. 2011లో తన న్యాయ బృందంలో పని చేస్తున్నప్పుడు మోరిస్‌ను కలిశారు. 2015 నుంచి వీరిద్దరూ రిలేషన్‌లో ఉన్నారు. తాజాగా వీరు జైలులో పెళ్లి చేసుకుని రికార్డు సృష్టించారు.
Also Read : ఏపీలో కీలక బిల్లుకు ఆమోదం.. ద్వితీయ అధికార భాషగా ఉర్దూ