Home » పవన్ మొదటి భార్య నందిని మామూలుది కాదు.. ఎన్ని కోట్లకు అధిపతి అంటే..!

పవన్ మొదటి భార్య నందిని మామూలుది కాదు.. ఎన్ని కోట్లకు అధిపతి అంటే..!

by Sravanthi
Published: Last Updated on
Ad

పవన్ కళ్యాణ్ ఈ పేరు చెప్తే చాలు ఆయన అభిమానులంతా అదోరకమైన ఉత్సాహంతో ఊగిపోతారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు ఉన్నా కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా డిఫరెంట్. పవన్ కళ్యాణ్ ను ఎంత ఆరాధిస్తారంటే దాన్ని మాటల్లో చెప్పలేం. ఫ్యాన్స్ ఏ విధంగా ఆయనను నమ్ముతారో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని కూడా ఆ విధంగానే గౌరవిస్తారు. అలా ఉన్నారు కాబట్టే ఆయనకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఫ్యాన్స్ ఉన్నారు. అలాంటి పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూనే క్రియాశీలక రాజకీయాల్లో కూడా చురుకుగా పాల్గొంటున్నారు.

also read:అందాల తార మాధవి మీకు గుర్తుందా..? ఆమె కూతుర్లు తల్లిని మించిపోయారుగా..!

Advertisement

రాబోవు ఎన్నికల్లో ఎలాగైనా జనసేన పార్టీ కొన్ని సీట్లు సాధించాలని ఉత్సాహాన్ని వ్యక్తం చేస్తున్నారు. దానికోసమే రాజకీయ విన్యాసాలు చేస్తూ వస్తున్నారు.కట్ చేస్తే పవన్ కళ్యాణ్ ఎన్నో సినిమాల్లో నటించారు, ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇదంతా బాగానే ఉన్నా ఆయన ముగ్గురిని పెళ్లి చేసుకోవడమే కాస్త సమస్యగా మారింది. కానీ దీనిపై ఎప్పటికప్పుడు ఆయన క్లారిటీ ఇస్తూనే వస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ కు మొదటి భార్యగా నందిని అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. ఈమె మీడియాకు దూరంగానే ఉండే సంగతి మనందరికీ తెలుసు.

Advertisement

also read:వేణుమాధవ్‌, ఉదయభాను మధ్యలో ఉన్న ఈ కమెడియన్‌ ఎవరో గుర్తుపట్టారా?

1997లో నందిని మెడలో తాళి కట్టాడు. ఇక 2007 సంవత్సరంలో పవన్ కళ్యాణ్ నందినికి విడాకులు ఇచ్చాడు. నందిని స్వస్థలం వైజాగ్. అయితే వీరిద్దరి మధ్య మనస్పర్ధలు రావడం వల్లే విడాకులు తీసుకున్నారని తెలుస్తోంది. విడాకులు తర్వాత నందిని పేరు మార్చుకొని మరో వివాహం చేసుకొని అమెరికాలో ఉంటున్నట్టు తెలుస్తోంది. అలాంటి నందిని పేరిట కోట్లాది రూపాయల ఆస్తులు ఉన్నాయట. ప్రస్తుతం ఆమె పేరు మీద 300 కోట్ల నుంచి 500 కోట్ల వరకు స్థిర చరాస్తులు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ విషయం తెలిసిన పవన్ అభిమానులు నందిని మామూలుది కాదు అంటూ కామెంట్లు పెడుతున్నారు.

also read:

Visitors Are Also Reading