Home » చాణక్య నీతి: ఇలాంటి భార్య మీ లైఫ్ లోకి వస్తే.. నష్టాలే.. చూసుకోండి…!

చాణక్య నీతి: ఇలాంటి భార్య మీ లైఫ్ లోకి వస్తే.. నష్టాలే.. చూసుకోండి…!

by Sravya
Ad

ఆచార్య చాణక్య చాలా విషయాలను చెప్పారు. చాణక్య చెప్పినట్లు చేయడం వలన జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. పెళ్లి గురించి కూడా చాణక్య అనేక విషయాలు చెప్పారు చాణక్య ప్రకారం వివాహం తర్వాత స్త్రీ, పురుషులు అన్ని విషయాలని అర్థం చేసుకోవాలి ఈరోజుల్లో చాలామంది భార్యాభర్తలు విడిపోతున్నారు. ఒకరితో ఒకరికి సెట్ అవ్వక విడిపోవడమే మంచిది అని అనుకుంటున్నారు. అయితే భార్యలో కొన్ని రకాల లక్షణాలు ఉన్నట్లయితే భర్తకి మంచిది కాదని చాణక్య అన్నారు. పెళ్లి చేసుకునేటప్పుడు ఈ విషయాలను గమనించడం మంచిది.

Advertisement

Advertisement

ఎప్పుడు స్త్రీ తన క్షేమం గురించి మాత్రమే ఆలోచించి.. డబ్బు కోసం భర్తని వేధిస్తూ ఉన్నట్లయితే ఆ భర్త ఖచ్చితంగా ఇబ్బందుల్లో ఇరుక్కుపోవాల్సి ఉంటుంది గొడవలు అవుతూ ఉంటాయి. మనశ్శాంతి కూడా ఉండదు. భర్త బుద్ధిమంతుడై భార్య మూర్ఖురాలు అయితే ఇల్లు సరిగ్గా నడవదట. మూర్ఖులు ఎప్పుడూ కూడా తెలివైన వాళ్లతో వాదిస్తారు. వాళ్లకి ఇతరులు చెప్పేది వినడం ఇష్టం ఉండదు. ఇలాంటి భార్య భర్తకు శత్రువు. కొంతమంది స్త్రీలు అబద్ధాలు చెప్తూ ఉంటారు. చిన్న విషయాలను కూడా పెద్దది చేస్తూ ఉంటారు అలాంటి స్త్రీలను ఎవరు కూడా నమ్మరు. ఇలాంటి భార్య వచ్చిందంటే భర్త నరకాన్ని చూస్తారు. భర్తతో కాకుండా ఇంకొకరితో సంబంధం పెట్టుకునే స్త్రీకి భర్త శత్రువు. పెద్దలని గౌరవించని స్త్రీ ఇంటికి శాపం. ప్రతి విషయానికి భార్య కోపం తెచ్చుకుంటే ఆ భర్త జీవితం నరకమే.

Also read:

Visitors Are Also Reading