ఒకప్పుడు భర్తలు సంపాదించి తీసుకువస్తే భార్యలు పిల్లల ఆలనా పాలనా చూసుకునేవారు. భర్తకు వండిపెట్టి ఇంటి పని మొత్తం చేసేవారు. కానీ ప్రస్తుతం మనం కంప్యూటర్ యుగంలో ఉన్నాం. ఇక్కడ ఒక్కరు సంపాదిస్తే అది ఏ మాత్రం సరిపోవడం లేదు. దాంతో ఖచ్చితంగా భార్యా భర్తలు ఇద్దరూ ఉద్యోగం చేసి సంపాదించాల్సిన పరిస్థితులు వచ్చాయి. అయితే కొంతమంది భార్యభర్తలు ఉద్యోగం చేసి సంపాదించినా కూడా ఆ డబ్బును పొదుపు చేసుకోకపోతే ఆర్థిక ఇబ్బందులు తప్పవు.
ఇవి కూడా చదవండి: Chanakya Niti : తెలివైన వ్యక్తుల్లో ఈ అలవాట్లు తప్పకుండా ఉంటాయి..!
Advertisement
కాగా తాజాగా ప్రముఖ ఫైనాన్షియల్ ప్లానర్ ఒకరు భార్య భర్తలు ఉద్యోగం చేసినట్లయితే డబ్బును పొదుపు చేసుకునేందుకు కొన్ని చిట్కాలను చెప్పారు. ఆ చిట్కాలు ఏవో ఇప్పుడు చూద్దాం….ప్రతి నెల జీతం వచ్చిన తరవాత మొదట ఒక ఆరు నెలల పాటూ నెలకు ఎంత ఖర్చు చేశారో ఎంత మిగిలిందో బడ్జెట్ ను వేసుకోవాలట.
ఇవి కూడా చదవండి: ఆ హీరో పెళ్లి చేసుకోవాలని చెప్పాడు..? నిత్యామీనన్ కామెంట్స్ వైరల్…!
Advertisement
ఆరు నెలల తరవాత కచ్చితంగా నెలకు ఎంత మిగులుతుందో తెలుస్తుంది. కాబట్టి దాన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అన్నదానిపై ఆలోచించాలట. కొంతమంది డబ్బులను ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తుంటారు. అలా చేసేటప్పుడు భార్య భర్తల్లో ఎవరి పేరు పై తక్కువ ట్యాక్స్ పడితే వారి ఖాతాలోనే సెవింగ్స్ చేయాలట. అంతే కాకుండా కొంత మంది భార్య భర్తలు సంపాదించిన జీతంలో ఒకరి జీతాన్ని సేవింగ్ చేస్తే మరొకరి జీతాన్ని కుటుంబం ఖర్చులకు వినియోగిస్తుంటారు.
అలా చేస్తే ఇద్దరిలో ఒకరి ఉద్యోగం పోయినా లేదంటే ఏదైనా సమస్య వచ్చి ఆ భారం అంతా మరొకరి పై పడిపోతుందట. కాబట్టి భార్య భర్తలు ఇద్దరు జీతాల నుండి కొంత డబ్బును సేవింగ్ చేయాలట. భార్య భర్తలు ఇద్దరికీ లైఫ్ ఇన్స్యూరెన్స్ తప్పనిసరిగా ఉండాలని చెబుతున్నారు. లైఫ్ ఇన్స్యూరెన్స్ ఉంటే ఇద్దరిలో ఒకరికి ఏదైనా ప్రమాదం జరిగినా లేదంటే మరణించినా మరొకరిపై భారం పడకుండా ఆ కుటంబం పై భారం పడకుండా ఉంటుందని చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి: బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ ని రమ్యకృష్ణ ఏమన్నదో తెలుసా..?