Home » భార్య భ‌ర్త‌ల మ‌ధ్య గొడ‌వ‌లు లేకుండా ఉండాలంటే పాటించాల్సిన 5 నియ‌మాలు…? 3 వ‌ది చాలా ఇంపార్టెంట్..!

భార్య భ‌ర్త‌ల మ‌ధ్య గొడ‌వ‌లు లేకుండా ఉండాలంటే పాటించాల్సిన 5 నియ‌మాలు…? 3 వ‌ది చాలా ఇంపార్టెంట్..!

by AJAY
Published: Last Updated on
Ad

పెళ్లికి ముందు ఉండే జీవితం చాలా చిన్నది. కేవలం 25 ఏళ్లు మాత్రమే ఉంటుంది. కానీ పెళ్లి తరవాతనే అసలైన జీవితం ఉంటుంది. పెళ్లి తర్వాత జీవితం సంతోషంగా ఉండాలంటే కొన్ని నియమాలు పాటించాలని ఆచార్య చాణక్యుడు తెలిపాడు. ఆ నియమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇవి కూడా చదవండి: మూల న‌క్ష‌త్రంలో పుట్టిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే క‌ష్టాలు త‌ప్ప‌వా..? అందులో నిజం ఎంత‌..?

Advertisement


భార్య భర్తలు ఒకరిపై ఒకరు అనుమానం పెంచుకోకూడదని చాణ‌క్యుడు పేర్కొన్నాడు. అనుమానం అనేది గొడవలకు దారితీస్తుందని దాంతో విడాకులు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని పేర్కొన్నాడు. ఒకవేళ అనుమానం ఉంటే జీవిత భాగస్వామిని దాని గురించి నిలదీయాలని అంతేకానీ మనసులో అనుమానం పెట్టుకుని మాత్రం ఉండకూడదు అని చెప్పాడు.


ప్రేమ చూపించడంలో స్వార్థం ఉండకూడదని చాణక్యుడు తెలిపాడు. తమ జీవిత భాగస్వామిని అతిగా ప్రేమిస్తున్నామా అని అస్సలు అనుకోకూడదని జీవితాంతం ఒకరికి ఒకరు తోడుగా ఉండాలి. కాబట్టి అలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దని తెలిపాడు.

Advertisement


భార్య భర్తలు ఆర్థిక క్రమశిక్షణ పాటించాలని చాణ‌క్యుడు పేర్కొన్నాడు. ఆర్థిక క్రమశిక్షణ ఉంటేనే జీవితంలో ఆర్థిక ఇబ్బందులు తలెత్తవ‌ని చెప్పాడు. జీవిత భాగస్వామి లో ఎవరికి డబ్బులు ఎక్కువగా ఖర్చు చేసే గుణం ఉన్నా కూడా మానుకోవాలని తెలిపారు.

భార్య భర్తల మధ్య ఒకరి కోసం మరొకరు త్యాగం చేసుకునే గుణం ఉండాలని తెలిపాడు. తమకు ఇష్టమైన వారి కోసం దేన్ని అయినా వదిలేసుకునే గుణం ఉన్నట్లయితే వారిద్దరి మధ్య ఎక్కువ ప్రేమ ఉంటుందని తెలిపాడు. అలా ఎక్కువగా ప్రేమించుకునే జంట కలకాలం కలిసి ఉంటుందని పేర్కొన్నారు.

భార్య భర్తలు ఇద్దరిలో ఎవరికైనా ఒకరికి కోపం ఉంటే తగ్గించుకోవాలని చాణక్యుడు తెలిపాడు. కోపం ఎక్కువ ఉన్నవారు ప్రేమ చూపించలేరని అన్నాడు. అంతేకాకుండా చిన్న విషయాలకే గొడవ పడేవారు ఎక్కువ కాలం కలిసి ఉండలేరని చాణ‌క్య‌నీతిలో పేర్కొన్నాడు.

ఇవి కూడా చదవండి:  మీ భాగస్వామికి మీపై ఎంత ప్రేమ ఉందో తెలియాలంటే.. ఈ 5 విషయాలపై ఓ లుక్కేయండి..!!

Visitors Are Also Reading