Home » పెళ్ళి తర్వాత అమ్మాయిలు ఎందుకు లావు అయ్యిపోతారు..?

పెళ్ళి తర్వాత అమ్మాయిలు ఎందుకు లావు అయ్యిపోతారు..?

by Sravya
Ad

పెళ్లి తర్వాత చాలా మార్పులు వస్తాయి. పుట్టింటి నుండి అత్తవారింటికి వెళితే ఎన్నో వాటి కోసం అడ్జస్ట్ అవ్వాల్సి ఉంటుంది. ఏ అమ్మాయికి కూడా పుట్టింట్లో ఉన్నంత సంతోషం అత్తవారింట్లో ఉండదు. ఆడైనా మగైనా వాళ్ళ జీవితాలని రెండు భాగాలకు చేయాలంటే పెళ్లికి ముందు పెళ్లి తర్వాత అని చెప్పడానికి అవుతుంది. ఈ రెండు జీవితాల్లో చాలా తేడాలు ఉంటాయి. ఎక్కువగా ఆడవాళ్ళ జీవితంలో తేడాలు ఉంటాయి. పుట్టింటి నుండి అత్త వాళ్ళ ఇంటికి వెళ్లడానికి ఎన్నో మార్పులు చివరికి ఫిట్నెస్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. పెళ్ళికి ముందు సన్నగా ఉన్న అమ్మాయిలు కూడా పెళ్లయిన తర్వాత కాస్త బొద్దుగా లావుగా తయారవుతూ ఉంటారు.

Advertisement

ఎందుకు బరువు పెరిగిపోతారు..? ఎంత సన్నగా ఫిట్ గా ఉండేవాళ్ళైనా సరే కాస్త ఒళ్ళు చేస్తారు దాని వెనుక కారణం ఏంటి అనేది చూద్దాం… కొత్తగా పెళ్లయిన వాళ్ళు రాత్రులు ఆలస్యంగా తినడం, తెలిసిన వాళ్ళు రావడం అందరితో కలిసి తినడం పార్టీలు వంటి వాటిని ఖచ్చితంగా ఫేస్ చేయాల్సి ఉంటుంది. క్యాలరీలు పెరిగిపోతాయి పోషకాలు తక్కువగా ఉండే ఫుడ్స్ తీసుకుంటారు బరువు బాగా తగ్గిపోతారు.

Advertisement

Also read:

అప్పటిదాకా డైట్ ఫాలో అయ్యే వాళ్ళు కూడా ఒక్కసారిగా కొత్త ఇంట్లో అభిరుచులు ఆహారానికి అలవాటు పడాల్సి ఉంటుంది. వంట పద్ధతుల్ని మార్చుకోవాలి జీర్ణవ్యవస్థ కూడా అలవాటు పడాలి .మళ్ళీ ఈ ఆహారానికి అలవాటు పడే వరకు వెయిట్ చేయాలి. ఈ నేపథ్యంలో బరువు పెరిగిపోతుంటారు. అలానే చాలామంది ఫుడ్ వేస్ట్ అయిపోతుంది ఏమో అని కొద్దిగా ఉండిపోయింది అని తినేస్తూ ఉంటారు. ఇలా మిగిలిపోతుందని తినడం వలన కూడా చాలామంది ఎక్కువ బరువు పెరుగుతారు. సో ఇలా పలు కారణాల వలన ఎంత సన్నగా ఉన్న వాళ్ళైనా కొంచమైనా బరువు పెరుగుతారు. లావు అవుతారు.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

 

Visitors Are Also Reading