Home » వినాయకుడుకు గరిక అంటే ఎందుకు అంత ఇష్టం..? పురాణాలు ఏం చెబుతున్నాయి అంటే..?

వినాయకుడుకు గరిక అంటే ఎందుకు అంత ఇష్టం..? పురాణాలు ఏం చెబుతున్నాయి అంటే..?

by Sravya

ఏ దేవుడుని ప్రార్థించాలన్నా, మొట్టమొదట మనం వినాయకుడిని ఆరాధిస్తూ ఉంటాము. వినాయకుడిని పూజించడం వలన అంతా మంచి జరుగుతుంది. వినాయకుడిని పూజిస్తే విఘ్నాలు తొలగిపోతాయి. వినాయకుడికి గరిక అంటే చాలా ఇష్టం. గరిక ని వినాయకుడికి పెట్టడం వలన అంతా మంచి జరుగుతుంది. వినాయకుడికి కుడుములు, ఉండ్రాళ్ళు అంటే కూడా చాలా ఇష్టం. వీటిని నైవేద్యంగా వినాయకుడికి పెడితే వినాయకుడి అనుగ్రహం కలుగుతుంది. గరిక అంటే వినాయకుడికి ఎందుకు అంత ఇష్టం అనే విషయాన్ని చూస్తే.. పురాణాల ప్రకారం చూసినట్లయితే అనలాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. భూమిపై ప్రతి చోట అశాంతిని అతను సృష్టించేశాడు. రాక్షసుడు తన ఆకలిని తీర్చుకోవడానికి ఋషులని కూడా తినేశాడు. దేవతలు కూడా అతన్ని ఆపలేకపోయారు గణేశుడు అతన్ని మింగి భూమిని రక్షిస్తాడు. కానీ రాక్షసుడిని మింగిన తర్వాత శరీరంలో మంట వస్తుంది.

శ్రీ విష్ణువు కమలాన్ని ఇస్తాడు. ఇంద్రుడు చంద్రుడిని ఇస్తాడు కానీ మంట తగ్గదు. 21 గరికలని వినాయకుడికి నైవేద్యంగా పెడితే మంట తగ్గుతుంది. అందుకని గణేశుడు పూజలో గరికను వాడతారు. ఇంకో కథని మనం చూసినట్లయితే, గణేశుడు ధ్యానంలో ఉన్నప్పుడు ఒక నర్తకి పెళ్లి చేసుకోవాలని ధ్యానానికి భంగం కలిగిస్తుంది. వినాయకుడా ఆమెని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోడు. ఆమెకి కోపం వచ్చి శపిస్తుంది. దీంతో వినాయకుడు శరీరం కాలిపోతుంది. గరికముక్కని తీసుకుని తలపై పెట్టుకుంటే మంటలు తగ్గుతాయి. అందుకని వినాయకుడికి గరికను పెట్టాలి అని అంటారు. ఇలా వినాయకుడికి గరిక ఎందుకు ఇష్టం అనే దాని వెనుక పలు కథలు ఉన్నాయి.

Also read:

Visitors Are Also Reading