కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఇటీవల గుండె పోటుతో మృతి చెందిన సంగతి తెలిసిందే. పునీత్ పాన్ ఇండియా హీరోగా పరిచయమవుతున్న క్రమంలో ఆయన మరణం అందర్నీ విషాదంలోకి నెట్టివేసింది. ఇక పునీత్ తండ్రి రాజ్ కుమార్ కూడా స్టార్ హీరోగా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. రాజ్ కుమార్ హీరోగా ఎన్నో సినిమాల్లో నటించి అలరించగా ఆయన జీవితంలో ఓసారి రియల్ గా కిడ్నాప్ అయ్యారు. అది కూడా స్మగ్లింగ్ అంటేనే గుర్తుకు వచ్చే వీరప్పన్ చేతిలో రాజ్ కుమార్ కిడ్నాప్ కు గురయ్యారు. రాజ్ కుమర్ ను వీరప్పన్ ఎందుకు కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ చేసిన తరవాత ఏం జరిగింది..అన్నది ఇప్పుడు చూద్దాం… 2000సం జులై 30న రాజ్ కుమార్ తన భార్య మరియు ఓ దర్శకుడితో కలిసి తిరుమలలో స్వామివారి దర్శనం చేసుకుని బెంగుళూరు బయలుదేరారు.
Advertisement
కాగా మార్గమద్యలో ఆయన తలనూరులోని తన గెస్ట్ హౌస్ లో బస చేశారు. తలనూరు తమిళనాడు రాష్ట్రంలో ఉంది. ఇక బోజనం చేసి రాత్రి 9 30 కు రెస్ట్ రాజ్ కుమార్ రెస్ట్ తీసుకుంటున్నారు. అయితే రాజ్ కుమార్ తలనూరు గెస్ట్ హౌస్ లో ఉన్నట్టు స్మగ్లర్ వీరప్పన్ కు సమాచారం అందింది. దాంతో ఆయన 15 మందితో వచ్చి వీరప్పన్ ను సినిమా స్టైల్ లో కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ చేసిన సమయంలో రాజ్ కుమార్ భార్య పార్వతమ్మకు వీరప్పన్ ఓ వీడియో క్యాసెట్ ఇచ్చి అందులో తమ డిమాండ్ లు ఉన్నాయని క్యాసెట్ ను సీఎంకు ఇవ్వాలని చెప్పాడు. అంతే కాకుండా రాజ్ కుమార్ కు ఎలాంటి హానీ తలపెట్టను అని హామీ ఇచ్చాడు. ఇక రాజ్ కుమార్ భార్య పార్వతమ్మ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయకుండా నేరుగా కర్నాటక సీఎం ఎస్ఎన్ క్రిష్ణ ఇంటికి వెళ్లి క్యాసెట్ ఇచ్చి మీరే రాజ్ కుమార్ ను కాపాడలని వేడుకున్నారు.
Advertisement
దాంతో ఆయన వెంటనే పోలీసులను అలర్ట్ అవ్వాలని ఆదేశించాడు. తమిళనాడు పోలీసులకు కూడా సమాచారం ఇచ్చి అలర్ట్ చేశారు. కానీ అప్పటికే వీరప్పన్ రాజ్ కుమార్ ను తీసుకుని అడవిలోని తన డెన్ కు చేరకున్నాడు. రాజ్ కుమార్ ను వీరప్పన్ కిడ్నాప్ చేసినట్టు తెలిసినా ఎలా విడిపించాలో తెలియక తమిళనాడు సీఎం కరుణానిధి…కర్నాటక సీఎం ఎస్ ఎన్ క్రిష్ణ లు తలలు పట్టుకున్నారు. అడవితో సంబంధం ఉన్న అధికారులను పిలిపించి వీరప్పన్ తో చర్చలు జరపాలని… ఎంత ఖర్చయియినా ఇస్తామన్నారు. వీరప్పన్ మహా అయితే కోటి లేదా 5 కోట్లు డిమాండ్ చేస్తాడని అనుకున్నారు. కానీ వీరప్పన్ మాత్రం వెయ్యికోట్ల విలువైన బంగారం..మరియు వెండి ఇవ్వాలని డిమాండ్ చేశాడు.
దాంతో వీరప్పన్ తో పరిచయం ఉన్న ఇండస్ట్రీకి చెందిన నక్కిరన్ గోపాల్ వ్యక్తిని పిలిపించి భేరాలు ఆడారు. ఈ క్రమంలో నక్కిరన్ గోపాల్ మూడు సార్లు అడవిలోకి వెల్లి వీరప్పన్ సంప్రదింపులు జరిపాడు. కర్నాటక ప్రభుత్వం 15 కోట్ల కంటే ఎక్కువ ఇవ్వలేమని చెప్పింది. దాంతో నక్కిరన్ గోపాల్ వీరప్పన్ ను కూడా తన మాటలతో భయపెట్టగా చివరికి15 కోట్లకు డీల్ తెగింది. అది కూడా మూడు నెలల తరవాత రాజ్ కుమార్ ను వీరప్పన్ వదిలిపెట్టారట. కానీ వీరప్పన్ నుండి భయటపడిన తరవాత రాజ్ కుమార్ అతడు భాగా చూసుకున్నాడని చెప్పారట కానీ మిగితా ఏ విషయాలు భయటపెట్టలేదట. ఇక 2004లో వీరప్పన్ ఎన్ కౌంటర్ లో చనిపోయిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా కన్నడ స్టార్ రాజ్ కుమార్ 2006 లో గుండె పోటుతో మృతి చెందారు.
ఇవి కూడా చదవండి:సింగర్ శ్రీరామ్ పై కుట్ర జరుగుతోందా…ఆ స్క్రీన్ షాట్ లను కావాలనే వైరల్ చేస్తున్నారా…?