అప్పట్లో ఎదురులేని మనిషి అనే అశ్వినీదత్ షూటింగ్ జరుగుతోంది. ఆ సినిమాలో ఎన్టీఆర్ కథానాయకుడు. వాణిశ్రీ కథానాయకురాలు. కృష్ణా ముకుందా మురారి అనే ఓ ఆకతాయి పాట షూటింగ్ జరుగుతోంది. షాట్ గ్యాప్ లో వాణి శ్రీ గారు ఎన్టీఆర్ దగ్గరికి వచ్చి ఆ పాటలో డాన్స్ మాస్టర్ చూపిస్తున్న మూమెంట్స్ గమనించారా,చాలా దుర్మార్గంగా ఉన్నాయనిపించింది నాకు, మీరు కాస్త ఆ డైరెక్టర్ ని పిలిచి చెప్తే బాగుంటుంది కదా అని అన్నారట. దానికి ఎన్టీఆర్ గారు నేను చెప్పను వాణిశ్రీ గారు అని అన్నారట. అదేంటండీ అని ప్రశ్నించారు వాణిశ్రీ.
Advertisement
Advertisement
ఇప్పటి ట్రెండ్ ఇదే అని నమ్మే వాళ్లు తీస్తున్నారు. అది తప్పో ఒప్పో చెప్పడానికి మనమెవరం. మనం నటించమని చెప్పేస్తే వేరే ఎవరినైనా పెట్టి తీసేసుకుంటారు వాళ్ళు. డబ్బులు పెట్టేది వాళ్లు గనుక ఎలా తీస్తే లాభం వస్తుంది అనే ఆలోచన చేసే తీస్తారు కదా. దాన్ని మనం ఎలా కాదనగలం. కాబట్టి మన ముందున్న దారులు రెండు.1. నచ్చకపోతే పూర్తిగా వదిలేసి వెళ్లిపోవడం,2. సర్దుకుపోయి నటించడం. నాకు తెలిసి ప్రస్తుతం మనం రెండోదారి ఎంచుకోవడమే కరెక్టేమో వాణిశ్రీ గారు అన్నారు. మీరు ఒక్క మాట చెబితే వాళ్ళు వింటారేమో అని మరోసారి చెప్పారట వాణిశ్రీ. నేను మహా అయితే ఇంకో ఐదారేళ్లు నటిస్తానేమో కాబట్టి వారు చెప్పినట్టు చేసుకెళ్లడమే బెటర్ అనే నిర్ణయానికి వచ్చేశాను. ట్రెండ్ ఫాలో కావడం అంటారు కదా అలా అని ఎన్టీఆర్ గారు చెప్పారట. వ్యక్తిగత ఇష్టాలతో ప్రమేయం ఏముంటుంది అని మరింత వివరణ కూడా ఇచ్చారట అన్నగారు. సరిగ్గా ఎన్టీఆర్ వివరణ పూర్తయ్యాక వాణిశ్రీ ఆలోచనల్లోకి వెళ్లారట. ఇక మానేయడమే బెటరనే అభిప్రాయానికి ఆమె రావడానికి ఆ సంఘటనే కారణమంటారు. అయితే ఈ విషయాలు వాణిశ్రీ గారే స్వయంగా చాలా ఇంటర్వ్యూలలో చెప్పారు.
ALSO READ;
ఎన్ని సంబంధాలు వచ్చినా మీకు పెళ్లి కావడం లేదా..? ఈ వాస్తు దోషాలు ఉంటే సరిచేసుకోండి..!
ప్రభాస్-అనుష్క ఇద్దరూ పెళ్లి చేసుకుంటేనే నేను పెళ్లి చేసుకుంటానంటున్న హీరో.. కారణం..!!