Home » నయన్ లాంటి హీరోయిన్లకు ఈ రూల్స్ ఎందుకు లేవు..?

నయన్ లాంటి హీరోయిన్లకు ఈ రూల్స్ ఎందుకు లేవు..?

by Sravya
Ad

ఈ మధ్య కాలంలో హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ గురించి ఒక విషయం వైరల్ అయింది రక్షణ అనే సినిమా కోసం ఆమె 50 రోజులు డేట్స్ ఇచ్చారు. సదరు సినిమా కోసం 47 రోజులు వాడుకుని మూడు రోజులను ప్రమోషన్స్ కోసం ఉంచుకున్నారు తీరా సినిమా విడుదల చేసి తేదీ వచ్చేసరికి ప్రమోషన్స్ కి రమ్మని నిర్మాత ప్రణదీప్ ఠాకూర్ అడిగారు దాంతో బకాయి ఉన్న మిగతా డబ్బు ఇవ్వలేదు. కనుక తాను సినిమా ప్రమోషన్స్ కి రావడం కుదరదని చెప్పారు దాంతో ప్రొడ్యూసర్ నిర్మాతల మండలికి కంప్లైంట్ చేశారు.

Advertisement

అక్కడ వాళ్ళు చేతులెత్తేయడంతో ఆర్ట్ అసోసియేషన్ కి అప్రోచ్ అయ్యారు అక్కడ కూడా ఫలితం దక్కలేదు. దీంతో బెదిరించి ఆయన పాయల్ని ప్రమోషన్స్ కి రమ్మని చెప్పారు చంపేస్తా అని కూడా బెదిరించారు. ఫోన్ చేసి బూతులు కూడా ఇష్టం వచ్చినట్లు తిట్టారట చాలా రోజులు పాటు చూసిన పాయల్ నిర్మాత టార్చర్ భరించలేక సోషల్ మీడియాలో తన ఆవేదనని వ్యక్తపరిచారు. నిజానికి గతంలో పాయల్ మీద ఎలాంటి ఆరోపణలు లేవు ఇండస్ట్రీలో హీరోయిన్స్ పరిస్థితి చాలా సున్నితం. ఎవరికి ఇబ్బంది వచ్చినా హీరోయిన్లకి ఎఫెక్ట్ అవుతుంది. అందుకే చాలా దాకా బయటకి రారు.

Advertisement

Also read:

ఎలా అయినా సరే అని పెద్ద సమస్యలో పాయల్ సమస్యను బయటపెట్టారు. ఇలా గతంలో కూడా చాలామంది ఇబ్బంది పడే ఉంటారు. పాయల్ వంటి చిన్న హీరోయిన్స్ ని నిర్మాతలు బెదిరిస్తున్నారు. ప్రమోషన్స్ కి రాని చాలామంది హీరోయిన్లు ఉన్నారు. వారి పరిస్థితి ఏంటి..? నయనతార కూడా సినిమా ప్రమోషన్స్ కి రారు. ఈ విషయం అందరికీ తెలుసు. అయినా కూడా కోట్ల రూపాయలు ఇచ్చి ఆమెని బుక్ చేసుకుంటారు. ఈ మధ్యకాలంలో బాలీవుడ్లోకి కూడా అడుగు పెట్టింది పాయల్ కంటే కూడా నయన్ కి ఉన్న అర్హత ఎక్కువ ఏంటి అది కేవలం ఆమెకు చేతిలో ఉన్న సినిమాలు. వాటి తాలూకా విజయాలే కదా..? టాలీవుడ్ పెద్దలు ఈ విషయం పై ఆలోచించాలి.

తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

 

 

Visitors Are Also Reading