విజయ్ దేవరకొండ లేటెస్ట్గా ఫ్యామిలీ స్టార్ సినిమాతో అందరినీ అలరించారు. ఈ సినిమా ఓటీటీ లోకి కూడా వచ్చేసింది థియేటర్ల లో మిస్ అయిన ప్రేక్షకులు ఇప్పుడు ఓటీటీ లో ఎగబడి చూస్తున్నారు. థియేటర్లలో ఈ సినిమా పెద్దగా ఆడలేదు అక్కడ మిస్ అయిన వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది. సో అందరూ ఓటీటీ లో చూడడానికి ఇష్టపడుతున్నారు. కొంతమంది ఈ సినిమాని చూసి తీసి పారేసే సినిమా కాదని అంటున్నారు. ఇంకొంత మంది విజయ్ దేవరకొండ యాక్షన్ సీన్స్ లో చాలా స్టైలిష్ గా కనపడ్డాడని కామెంట్స్ చేస్తున్నారు.
Also read:
Advertisement
కొంతమంది విజయ్, మృణాల్ జంట బాగుందని వాళ్ళ అభిప్రాయాన్ని చెప్తున్నారు. అలానే ట్రోలింగ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ముఖ్యంగా ఈ మూవీలో ఒక సీన్ ఉంటుంది రవిబాబు హీరో వదినతో అసభ్యంగా మాట్లాడుతాడు. అందుకని హీరోకి కోపం వచ్చి ఫైట్ చేయడానికి ఏకంగా ఫ్యామిలీతో పాటు ఆ రౌడీ ఉండే ప్లేస్ కి వస్తాడు. అక్కడ ఒక ఫైట్ ఉంటుంది అక్కడ విజయ్ దేవరకొండ ఆటిట్యూడ్ కూడా బాగుంది. కాకపోతే ఈ ఫైట్ అంతా అయిపోయిన తర్వాత ఆ రౌడీ చెవి దగ్గరకు హీరో వెళ్లి మీ ఇంట్లో కూడా లేడీస్ ఉంటారు మా ఇంట్లో కూడా మగవాళ్ళు ఉంటారు.
Advertisement
Also read:
గోడ, ట్రైన్ ఎక్కడపడితే అక్కడ అని ఘోరమైన డైలాగులు చెప్తాడు పిల్లలకి మంచి విషయాన్ని చెప్తానని స్కూల్ మానిపించి తీసుకొచ్చి హీరో అలా మాట్లాడటం ఏంటి అని కొంతమంది అడుగుతున్నారు. నిజంగానే ఆ డైలాగులు అని దర్శకుడు అనవసరంగా పెట్టాడేమో అనే భావన అందరికీ కలిగింది. ఈ డైలాగు లేకుండా ఉంటే బాగుండేదని ప్రేక్షకులు అంటున్నారు.
తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!