Home » ఆ కారణాలవల్లే… తారకరత్న పెద్ద స్టార్ కాలేకపోయారా?

ఆ కారణాలవల్లే… తారకరత్న పెద్ద స్టార్ కాలేకపోయారా?

by Bunty
Ad

ఒకటో నెంబర్ కుర్రాడు అని ప్రేక్షకులు ప్రేమతో పిలుచుకునే తారకరత్న ఇకలేరు. సినిమాలు మరియు రాజకీయాల ద్వారా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న తారకరత్న గుండెపోటు రావడంతో కొన్ని రోజులపాటు మృత్యువుతో పోరాడి మరణించారు. అయితే బ్యాగ్రౌండ్ ఉన్న స్టార్ హీరో కాలేకపోయారు తారకరత్న. సరైన కథలను, సరైన డైరెక్టర్లను ఎంచుకోలేకపోవడం తారకరత్నకు మైనస్ అయిందని చాలామంది భావిస్తారు.

taraka-rathna-photos

Advertisement

 

తారకరత్నకు లక్ కూడా కలిసి రాలేదని చాలామంది భావిస్తారు. ఒకటో నెంబర్ కుర్రాడు మూవీ తారకరత్న తొలి సినిమా కాగా, ఈ సినిమా కమర్షియల్ గా మంచి ఫలితాన్ని అందుకుంది. అయితే ఆ తర్వాత హీరోగా తారకరత్నకు ఈ స్థాయి విజయం దక్కలేదు. నందమూరి హీరోల సినిమాలలో నటించి ఉంటే తారకరత్న స్థాయి మరింత పెరిగేదని, తారకరత్న వేర్వేరు కారణాలవల్ల ఆ విధంగా చేయలేదని బోగట్టా. హీరోగా సక్సెస్ కాలేకపోయినా నటుడిగా తారకరత్న సక్సెస్ అయ్యారు.

Advertisement

తారకరత్న అమరావతి, రాజా చెయ్యి వేస్తే సినిమాలలో నెగటివ్ షేడ్స్ రోల్స్ లో నటించి ఎంతగానో ఆకట్టుకున్నారు. తారకరత్నకు నటుడిగా పలు అవార్డులు సైతం వచ్చాయి. తారకరత్న నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కయి. కొన్ని రోల్స్ లో తారకరత్న కాకుండా మరి ఎవరు నటించినా ఆ సినిమాలో ఈ రేంజ్ లో సక్సెస్ అయ్యేవి కావని కొంతమంది సోషల్ మీడియా వేదికగా చేస్తున్న కామెంట్లు తెగ వైరల్ అవుతున్నాయి. చాలామంది దర్శకులు సైతం తారకరత్న మంచి ఇంటెన్సిటీ ఉన్న యాక్టర్ అని చెబుతారు. తారకరత్నను ఇండస్ట్రీ కరెక్ట్ గా వాడుకుని ఉంటే బాగుండేదని పలువురు భావిస్తున్నారు.

READ ALSO : తారకరత్న మరణ వార్తను…చంద్రబాబు ఇన్నాళ్లు దాచారు – లక్ష్మీపార్వతి 

Visitors Are Also Reading