Home » సిల్క్‌ స్మిత జీవితం అర్థాంతరంగా ముగిసిపోవడానికి కారణం తెలుసా..?

సిల్క్‌ స్మిత జీవితం అర్థాంతరంగా ముగిసిపోవడానికి కారణం తెలుసా..?

by Sravya
Ad

సిల్క్ స్మిత గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. సిల్క్ స్మిత అందరికీ సుపరిచితమే సినిమా అనేది సామాన్య ప్రేక్షకులకి ఒక వినోద సాధనం. అయితే సినిమా రంగం ఒక అద్దాల మేడలా రంగుల ప్రపంచాల కనపడుతుంటుంది అక్కడ ఉండే వాళ్ళు సుఖసంతోషాలతో ఉంటారని అందరూ అనుకుంటారు. అయితే సినిమాల్లో నటించే వాళ్ళకి కూడా కష్టాలు ఉంటాయి. తెర మీద నవ్వులు చిందిస్తూ ఉన్న వాళ్ళ లైఫ్ లో కష్టాలు కన్నీళ్లు ఉంటాయి. కానీ అవి ఏమీ కనపడకుండా ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. చాలామంది తారల జీవితాలు అర్దాంతరంగా ముగిసిపోయి కూడా అటువంటి వాళ్ళలో సిల్క్ స్మిత కూడా ఒకరు. వందల సినిమాల్లో నటించారు ఆమె కొన్ని కోట్ల ఆస్తులు సంపాదించారు చివరికి ఆస్తులు అన్నింటినీ పోగొట్టుకొని కష్టాలని ఎదుర్కొన్నారు.

Advertisement

ఎంత కష్టాలు అనుభవించారంటే ఆ$త్మహ$త్య చేసుకునే అంతలాగ ఆమెని ప్రభావితం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా లో విజయలక్ష్మి పుట్టారు ఆర్థిక స్తోమత లేని కారణంగా నాలుగో తరగతి వరకు మాత్రమే చదివారు. చిన్నతనం నుండి విజయలక్ష్మి కి సినిమాలంటే చాలా ఇష్టం సినిమాలను చూసి డ్యాన్సులు ఇంట్లో చేస్తూ ఉండేవారట తన పెద్దమ్మ అన్నపూర్ణ ఆ విషయాన్ని గమనించి గుంటూరులో ఒక సినిమా షూటింగ్ జరుగుతుందని తెలుసుకుని అక్కడికి వెళ్లి, దర్శకుడును కలిసి విజయలక్ష్మిని విజయమాలగా పరిచయం చేసింది. సినిమాలో సిల్క్ అనే పాత్రని దర్శకుడు మొదట విజయలక్ష్మికి ఇచ్చారు. ఇలా స్మితగా పేరు తెచ్చుకుంది.

Advertisement

విజయ లక్ష్మి కి ముందు సిల్క్ ని చేర్చి సిల్క్ స్మితగా మార్చేశారు. వాంప్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, గ్లామర్ ఆర్టిస్ట్ గా కొన్ని సంవత్సరాలు పాటు ఒక ఊపుపేసింది సిల్క్ స్మిత. సిల్క్ స్మిత కి క్రేజ్ కూడా విపరీతంగా పెరిగింది. రాధాకృష్ణ అనే డాక్టర్ ఆమె జీవితంలోకి ప్రవేశించాడు ఆమెతో సహజీవనం చేశాడు. అయితే అప్పటికే అతనికి పెళ్లి అయిపోయి పిల్లలు కూడా ఉన్నారు ఆ విషయం తెలిసినా సిల్క్ స్మిత సహించింది. క్రమంగా ఆమె ని మద్యానికి బానిస చేసి తన వికృతి చేష్టలతో ఆమెని మానసికంగా, శారీరకంగా హింసించేవాడు. వీటన్నిటితో కృంగిపోయి మరణమే మేలని అనుకుని ఆ$త్మహ$త్య చేసుకుని తనువు చాలించింది ఆమె ఎందుకు చనిపోతుంది అనేదాని వెనుక కారణాలు కూడా రాసి మరీ ఆమె ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading