Home » Shoban Babu: సుస్వాగతం, అన్నమయ్య, అతడు సినిమాలను శోభన్ బాబు ఎందుకు వదిలేసుకున్నారు..?

Shoban Babu: సుస్వాగతం, అన్నమయ్య, అతడు సినిమాలను శోభన్ బాబు ఎందుకు వదిలేసుకున్నారు..?

by Sravya
Ad

Shoban Babu : అప్పటి టాప్ హీరోలలో శోభన్ బాబు కూడా ఒకరు. శోభన్ బాబు గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. సాధారణంగా కొన్ని వందల మూవీస్ చేసిన నటుడికి కూడా సినిమా అవకాశాలు ఒక్కోసారి తగ్గిపోతూ ఉంటాయి. కొంత వయసు వచ్చిన తర్వాత అవకాశాలు రావు. ప్రేక్షకులు కూడా వాళ్ళని స్క్రీన్ మీద చూడడానికి ఆసక్తిని చూపించరు. ఇక హీరోలుగా అవకాశాలు రాక కొన్ని కీలక పాత్రలు లేదంటే సహాయ నటుడిగా చేస్తూ ఉంటారు. ఈ కాలంలో చాలా మంది క్యారెక్టర్ ఆర్టిస్టులు ఒకప్పటి హీరోలే.

shobanbabu

Advertisement

ప్రాధాన్యతని పక్కన పెట్టేసి వచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకుంటూ ఉంటారు హీరోలు. కానీ నటభూషణ శోభన్ బాబు మాత్రం అలా చేయలేదు హీరోగా వందల సినిమాల్లో నటించారు తర్వాత వచ్చిన ఎన్నో అద్భుతమైన అవకాశాలని వదులుకున్నారు. శోభన్ బాబు వదులుకున్న పాత్రలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

నాగార్జున కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన అన్నమయ్య సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనకి తెలుసు. ఈ మూవీలో వెంకటేశ్వర స్వామి పాత్ర కోసం శోభన్ బాబుని అడిగారు. కానీ ఆయన ఒప్పుకోలేదు పవన్ కళ్యాణ్ సుస్వాగతం సినిమాలో హీరో తండ్రిగా నటించిన రఘువరన్ కి ఎంతో మంచి పేరు వచ్చింది. ఆ క్యారెక్టర్ కోసం శోభన్ బాబుని సంప్రదించారు. కానీ శోభన్ బాబు ఆ పాత్ర చేయడానికి ఒప్పుకోలేదు. ఆ పాత్రని రిజెక్ట్ చేశారు. అతడు మూవీలో నాజర్ పోషించిన పాత్ర కోసం కూడా శోభన్ బాబుని ముందు అడిగారు కానీ ఆ పాత్రను కూడా శోభన్ బాబు మిస్ చేసుకున్నారు. అన్నమయ్య సుస్వాగతం సినిమాల్లో నటించడానికి శోభన్ బాబు ఒప్పుకోకపోవడంతో నిర్మాత మురళీమోహన్ శోభన్ బాబుకి ఒక బ్లాంక్ చెక్ ఇచ్చి పాత్ర పోషించమని అన్నారట. కానీ శోభన్ బాబు ఒప్పుకోలేదు. హిందీలో అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్ర పోషించిన బ్లాక్ చిత్రం అక్కడ ఘనవిజయాన్ని అందుకుంది ఈ మూవీని తెలుగులో శోభన్ బాబుతో రీమేక్ చేయాలనుకున్నారు.

Advertisement

Also read:

shoban babu rejected athadu movie

shoban babu rejected athadu movie

Also read:

నిర్మాత చౌదరి ఆ పాత్రకి ఉన్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని తప్పకుండా నటిస్తారని అనుకున్నారు కానీ శోభన్ బాబు అది కూడా ఒప్పుకోలేదు. ఇన్ని సినిమాలకి నో చెప్పిన శోభన్ బాబు ఒక సినిమాలో కీలక పాత్ర చేయడానికి ఒప్పుకున్నారు. కోడి రామకృష్ణ దర్శకత్వంలో విబి రాజేంద్రప్రసాద్ ఒక మల్టీ స్టార్ సినిమాని తీసుకురావాలని అనుకున్నారు. కృష్ణ, శోభన్ బాబు, జగపతిబాబు ప్రధాన పాత్రలో సినిమా చేయాలని అనుకున్నారు కానీ ఈ సినిమా ప్రారంభం కాకుండా ఆగిపోయింది. హీరోగా నన్ను ప్రేక్షకులు గుండెల్లో పదులపరుచుకున్నారు. వారి మనసులో ఆ స్థానం అలానే ఉండాలన్నది నా కోరిక. అందుకే శోభన్ బాబు ఇటువంటి పాత్రలు చేయడానికి నేను ఒప్పుకోలేదు అని ఆయన ఓసారి చెప్పారు.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

 

Visitors Are Also Reading