అడవి శేష్ హీరోగా మహేష్ బాబు నిర్మాతగా ఎంతో మంది ప్రజల ప్రాణాల కాపాడడానికి తన ప్రాణాలను పణంగా పెట్టి సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం మేజర్. ఈ చిత్రం జూన్ 03న విడుదల అయిన విషయం తెలిసినదే.
Advertisement
ఈ సినిమాకు సంబంధించి ప్రేక్షకుల్లో ఎన్నో అంచనాలు పెరిగిపోయాయి. ఈ చిత్రాన్ని చూసేందుకు అందరూ తరలి థియేటర్లకు తరలివెళ్తున్నారు. ఇక 26 11 ముంబై దాడులకు సంబంధించి ఇక ఈ చిత్రం తెరకెక్కిందనే చెప్పాలి. ఈ సినిమాలో మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ భార్య పాత్రలో సయి మంజ్రేకర్ నటించింది. ఇక మేజర్ సినిమా ప్రతీ ప్రేక్షకుడికి హృదయాన్ని హత్తుకుంటుందనే చెప్పాలి. ఇలాంటి సమయంలోనే కొంతమంది ప్రేక్షకుల్లో కొన్ని డౌట్స్ వస్తున్నాయి. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
2008లో జరిగిన ఉగ్రవాద దాడులలో సందీప్ ఉన్ని కృష్ణన్ తో ఎంతో మంది సైనికులు మరణించారు. కానీ కేవలం సందీప్ ఉన్ని కృష్ణన్ ఎందుకు అంత స్పెషల్. ఆయన జీవిత కథ ఆధారంగానే ఎందుకు సినిమా తీసారనే ప్రశ్నలు తెరమీదకు వస్తున్నాయి. సాదారణంగా ఇది ఓ సగటు ప్రేక్షకుడికి సాధారణంగా వచ్చే ప్రశ్న అనే విషయం తెలిసిందే. ఈ విషయంపై ఇటీవల మేజర్ దర్శకుడు శశికిరణ్ క్లారిటీ ఇచ్చారు. అందరికీ ఓ ఇన్సిపిరేషన్ అనేది ఉంటుంది. ఫ్రీడమ్ ఫైటర్స్ చాలా మంది ఉంటారు. కానీ దృష్టి అనేది ఒకరిపైనే పడుతుంటుంది. అడవి శేషు లుక్ సందీప్ ఉన్ని కృష్ణన్ పాత్రకు చాలా దగ్గరగా ఉంటుంది.
అలా అని ప్రాణాలర్పించిన మిగతా సైనికులను తక్కువ చేయడం లేదు. ముందు ముందు ఫిలిం మేకర్స్ వారి బయోఫిక్ పై కూడా చిత్రాలను నిర్మించే అవకాశం ఉంటుంది. ఈ బయోఫిక్ అనేది అందరూ సంతోషంగా తీయాల్సిన సినిమా. సందీప్ ఉన్ని కృష్ణన్ కుటుంబం కూడా ఎంతగానో సహకరించింది. అది ఆయన హావ భావాలు ఎలా ఉంటాయనే విషయంపై వివరించారు. వారి సహకారం లేనిదే బయోపిక్ మేము తెరకెక్కించే వాళ్లం కాదని.. ఇంతకు మించి ఎక్కువ చెప్పలేనని శశికిరణ్ తిక్క ఓ క్లారిటీ ఇచ్చారు.
Also Read :
మహేష్ బాబు అన్న రమేష్ బాబు ఫ్యామిలీని ఎప్పుడైనా చూసారా..?
బిగ్‌బాస్ 6 కంటెస్టెంట్స్ లిస్ట్ ఇదే.. వీరందరూ ఎవరు..?