Home » మహేష్ బాబు అన్న రమేష్ బాబు ఫ్యామిలీని ఎప్పుడైనా చూసారా..?

మహేష్ బాబు అన్న రమేష్ బాబు ఫ్యామిలీని ఎప్పుడైనా చూసారా..?

by AJAY
Ad

టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ కుమారులలో పెద్ద కుమారుడు రమేష్ బాబు కాగా మరో కుమారుడు మహేష్ బాబు. వీరిద్దరూ టాలీవుడ్ లో హీరోలుగా పరిచయమయ్యారు. కానీ వీరిలో మహేష్ బాబు స్టార్ హీరోగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. అయితే రమేష్ బాబు మాత్రం ప్రారంభంలో కొన్ని సినిమాలు చేసి ఆ తర్వాత సినిమాల్లో రాణించలేక దూరమయ్యారు. కానీ రమేష్ బాబు చాలా కాలం పాటు నిర్మాతగా వ్యవహరించారు.

 

Advertisement

ఇదిలా ఉంటే రమేష్ బాబు ఇటీవల అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. దాంతో మహేష్ బాబు ఎమోషనల్ అయ్యారు. రమేష్ బాబు మరణించిన సమయంలోనే మహేష్ బాబుకు కరోనా సోకడంతో రమేష్ బాబు అంత్యక్రియలకు కూడా హాజరు కాలేకపోయారు. తన అన్న రమేష్ బాబు తనను ఎంతో సపోర్ట్ చేశారని మహేష్ బాబు ఎమోషనల్ అయ్యారు. తన అన్న తనకు రోల్ మోడల్ అని చెప్పారు.

Advertisement

ఇదిలా ఉంటే మహేష్ బాబు గురించి ఆయన కుటుంబం గురించి ప్రేక్షకులకు, సినీ ప్రియులకు తెలుసు కానీ రమేష్ బాబు కుటుంబం గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. అంతే కాకుండా రమేష్ బాబు సినిమాలకు దూరంగా ఉండటంతో ఆయన కుటుంబం కూడా మీడియా ముందుకు రాలేదు. ఇదిలా ఉంటే రమేష్ బాబుకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.

 

రమేష్ బాబు భార్య పేరు మృదుల కాగా ఆయన కూతురు పేరు భారతి అంతేకాకుండా కొడుకు పేరు జయ కృష్ణ. రీసెంట్ గా రమేష్ బాబు మరణం తర్వాత జరిగిన వేడుకల్లో ఆయన భార్య మృదుల మరియు కుమారుడు జయకృష్ణ మీడియా ముందు కనిపించారు. దాంతో ప్రస్తుతం వారికి సంబందించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Also read :

ఆ హీరోతో న‌దియా పెళ్లి వ‌ర‌కూ వెళ్లిందా…? చివ‌రికి ఏం జ‌రిగిందంటే..!

Visitors Are Also Reading