మాస్ మహారాజ రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే రవితేజకు గత కొంత కాలంగా హిట్స్ సరిగ్గా లేవు. అప్పుడెప్పుడో రాజా ది గ్రేట్ అనే హిట్ ఇచ్చిన తర్వాత వరుసగా ప్లాప్స్ ఇచ్చి మళ్ళీ క్రాక్ సినిమాతో హిట్ అందుకున్నాడు. కానీ మళ్ళీ ఈ సినిమా తర్వాత ప్లాప్ సినిమా ఖిలాడీతో అభిమానుల ముందు కు వచ్చాడు. అయితే ఈ సినిమా హిట్ కాకపోయినా రవితేజ దగ్గరకు నిర్మాతలు రావడం మాత్రం ఆగడం లేదు. ఎందుకంటే ఆయన సినిమాలు హిట్ కాకపోయినా కూడా నిర్మాతలకు నష్టాలూ అనేవి రావు. అలా ఎందుకో మీకు తెలుసా.. రండి చూద్దాం..!
Advertisement
అయితే రవితేజ ఇప్పుడు త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ధమాకా అనే సినిమా చేస్తున్నాడు. దీంతో పాటు శరత్ మండవ దర్శకత్వంలో రామారావు ఆన్ డ్యూటీని కూడా నడిపిస్తున్నాడు.అదే విధంగా సుధీర్ వర్మ దర్శకత్వంలో రావణాసుర అనే సినిమాను చేస్తూ… వంశీ కృష్ణ దర్శకత్వంలో టైగర్ నాగేశ్వరరావు అనే ఓ స్టూవర్టుపురం గజదొంగకు సంబంధించిన బయోపిక్ కు కూడా తీస్తున్నాడు. ఇక ఈ సినిమాలే కాదు రవితేజ ఓకే చెప్తే ఆయనతో సినిమా తీయడానికి చాలా మంది నిర్మాతలు కూడా సై అంటారు. ఆయన సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా సినిమాలు తీస్తారు.
Advertisement
అయితే ఇందుకు కారణం రవితేజ సినిమాలు థియేటర్లో ఆడకపోయినా తప్పకుండా బుల్లితెరపైన సూపర్ హిట్ అవుతుంది అని అందరూ నమ్ముతారు. అందుకే మాస్ మహారాజ సినిమాలకు నాన్ థియేట్రికల్ లో భారీగా మార్కెట్ ఉంటుంది. ఈ సినిమాలకు టీవీల్లో భారీ టీఆర్పీ రావడం మాత్రమే కాకుండా.. హిందీలో డబ్బింగ్ చేసి విడుదల చేసే సినిమాలు కూడా యూట్యూబ్ లో భారీ వ్యూస్ రాబడుతున్నాయి. తాజాగా వచ్చిన ఖిలాడీ సినిమా కూడా నాన్ థియేట్రికల్ లో భారీ ధరకు అమ్ముడైంది. అందుకే రవిజేత సినిమా ప్లాప్ అయినా.. ఆయనకు 20 కోట్ల వరకు కూడా రెమ్యునరేషన్ అనేది వస్తూ ఉంటుంది.
ఇవి కూడా చదవండి :