Home » పంత్ కు కెప్టెన్సీ అప్పుడే ఇవ్వాలి…!

పంత్ కు కెప్టెన్సీ అప్పుడే ఇవ్వాలి…!

by Azhar
Ad
ప్రస్తుతం టీ ఇండియాకు మూడు ఫార్మాట్లలో కెప్టెన్ గా రోహిత్ శర్మ వ్యవరిస్తున్న విషయం తెలిసిందే. కానీ రోహిత్ తర్వాత జట్టుకు కాబోయే కెప్టెన్ ఎవరు అనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. అయితే ఈ రేసులో చాలా మంది ఆటగాళ్లు ఉన్నారు. అందులో భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ కూడా ఒక్కడు. ఈ ఐపీఎల్ 2022 సీజన్ ముగిసిన తర్వాత టీం ఇండియా సౌత్ ఆఫ్రికాతో 5 టీ20ల సిరీస్ ఆడిన విషయం తెలిసిందే. అందులో కెప్టెన్ రోహిర్ లేకపోవడంతో కేఎల్ రాహుల్ కు ఆ బాధ్యతలు అప్పగించారు. కానీ చివర్లో రాహుల్ కు గాయం కావడంతో ఆ బాధ్యతలు పంత్ చేతికి వచ్చాయి.
కానీ పంత్ మాత్రం కాప్టెన్ గా నిరూపించుకోలేకపోయారు. ఈ సిరీస్ లో మొదటి రెండు మ్యాచ్ లలో ఒదిన పంత్.. తర్వాత రెండు గెలిచాడు. కానీ చివరి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో సిటీస్ టైగా ముగిసింది. అయితే ఇందులో పంత్ కెప్టెన్సీపై చాలా విమర్శలు వచ్చాయి. అతనికి ఆటగాళ్లను కంట్రోల్ చేయడం రావడం లేదు అని… బౌలర్లను ఎలా ఉపయోగించుకోవాలలో తెలియడం లేదు అని చాలా మంది అన్నారు. ఇక ఇప్పుడు అందులో బీసీసీఐ మాజీ సెలక్టర్ మదన్ లాల్ కూడా చేరిపోయారు. పంత్ కు అసలు కెప్టెన్సీ ఇవ్వాల్సింది కాదు అని ఆయన అన్నారు.
తాజాగా మదన్ లాల్ మాట్లాడుతూ.. టీం ఇండియా కు కెప్టెన్ గా వ్యవరించడం అంటే అది మాములు విషయం కాదు. పంత్ అందుకు సరిపోడు. అసలు ఆతనికి ఇప్పుడు కెప్టెన్సీ ఇవ్వాల్సింది అని అన్నారు. పంత్ ఇంకా యువ ఆటగాడు. కాబట్టి అతనికి కనీసం ఇంకా రెండే ఏళ్ళు అయిన సమయం ఇవ్వాలి. ఆ సమయంలో తనను తాను పంత్ బెటర్ బ్యాటర్ గా మార్చుకోవాలి అని సూచించాడు. ఆ తర్వాతే అతనికి కెప్టెన్సీ ఇస్తే బాగుటుంది. కానీ ఇప్పుడే ఇస్తే మాత్రం అది ఓ పిచ్చి చర్య అన్ని మదన్ లాల్ తన అభిప్రాయం తెలిపారు.

Advertisement

Visitors Are Also Reading