పెళ్లి తర్వాత భార్యాభర్తల మధ్య ఏదో ఒక సమస్య వస్తూ ఉంటుంది. అలానే పిల్లలు పుట్టిన తర్వాత భార్యాభర్తల మధ్య పలు సమస్యలు వస్తాయి. పిల్లలు పుట్టిన తర్వాత భార్యాభర్తల మధ్య ఎదురయ్యే సమస్యలు ఏంటో ఇప్పుడు చూద్దాం. పిల్లల్ని కన్న తర్వాత బాధ్యతలు ఎక్కువవుతాయి. ఈరోజుల్లో తల్లులు కూడా ఉద్యోగం చేస్తున్నారు. బాధ్యతతో ఉండలేక భార్య భర్తలు ఇద్దరి మధ్య తీవ్రమైన గొడవలు జరుగుతాయి. భార్య భర్త పిల్లలు పుట్టే దాకా ఒకరితో ఒకరు మంచి రిలేషన్ షిప్ లో ఉంటారు. కనెక్ట్ అయి ఉంటారు.
Advertisement
పిల్లలు పుట్టిన తర్వాత బాధ్యతల్లో పడి భాగస్వామికి తక్కువ సమయాన్ని కేటాయిస్తారు దీని వలన కూడా సమస్యలు వస్తాయి. పిల్లలు పుట్టాక వాళ్లతో దూర ప్రయాణం చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎక్కువగా ప్రయాణాలు చేయడానికి ఎవరు ఇష్టపడరు. కానీ కలిసి సరదాగా కుటుంబంతో గడపాలని అనుకుంటుంటారు. ఇవి కూడా ఇద్దరి మధ్య గొడవలు తీసుకువస్తాయి.
Advertisement
Also read:
Also read:
భార్యాభర్తలు పెళ్లి తర్వాత ఎంత బిజీ లైఫ్ లో ఉన్నా కూడా ఒకరి కోసం ఒకరు సమయాన్ని కేటాయిస్తారు. పిల్లలు పుట్టిన తర్వాత పిల్లలపై శ్రద్ధ పెట్టి జీవిత భాగస్వామిని పట్టించుకోవడానికి సమయం దొరకదు. దీని వలన కూడా సమస్యలు వస్తాయి. చాలామంది తల్లులు పిల్లలు పుట్టాక వాళ్ల కోసమే మొత్తం సమయాన్ని గడుపుతారు. శిశువులు నిద్రపోతున్న కూడా వాళ్ళ పక్కనే ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. భర్త పై శ్రద్ధ పెట్టలేకపోతుంటారు. ఇలా ఈ కారణాల వలన భార్యాభర్తల మధ్య సమస్యలు వస్తాయి.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!