హిందూ సంప్రదాయాల ప్రకారంచ మనం ఒక్కో గుడికి వెళ్లినప్పుడు ఒక్కోవిధంగా నడుచుకుంటాం. మన హిందూ ఆచార వ్యవహారాల ప్రకారం.. ఏ దేవుడికి ఎలా పూజ చేయాలి..? ఏ దేవుడికి ఏమి ఇష్టం.. అక్కడ నడుచుకోవాల్సిన విధి, విధానాల గురించి తెలుసుకుంటుంటాం. అందులో భాగంగానే శివుడి గుడికి వెళ్లితే అభిషేకం, హనుమంతుడి గుడికి వెళ్లితే సింధూరం పెట్టించి ప్రత్యేక పూజ చేయించడం, గ్రామ దేవతలు అయితే కోళ్లు, మేకలు బలి ఇస్తూ ఇలా వివిధ రకాలుగా దేవుళ్లనుకొలుస్తుంటాం.
Advertisement
శివుడి గుడికి వెళ్లినప్పుడు మాత్రం మరింత జాగ్రత్తగా ఉండాలని మన పెద్దలు చెబుతుంటారు. అందుకు కారణం ఏమింటంటే శివాలయంలో ఉండే శివలింగానికి, నందీశ్వరునికి మధ్య మనుషులు నడవకూడదు అని అంటుంటారు. మనం చూసుకోకుండా వెళ్లినా అనుకోకుండా వెళ్లినా కానీ మనకు మంచి జరుగదు అని చెబుతుంటారు. మనం శివాలయానికి వెళ్లినప్పుడు చాలా జాగ్రత్తగా నడుచుకుంటాం. అసలు నిజంగానే అలా నడవకూడదా నడిస్తే ఏమవుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
మన పురాణ గాథల ప్రకారం ఏజయర్ద్వియోర్మధ్యే నంది శంకర యోరపి అనే ప్రమాణముంది. అంటే మేకపోతుల మధ్య, ద్విజుల మధ్య, నంది శంకరుల మధ్య నడవరాదని అర్థం. ఆ పురాణాల ప్రకారం మన పెద్దలు నంది, శివలింగాల మధ్య నడవకూడదని చెబుతుంటారు. శివుడు భక్తాను గ్రహతత్పరుడు. అలాగే నందీశ్వరుడు శివభక్తుల్లో అగ్రగణ్యడు. అంటే శివుడిని ఆరాధించడంలో నందీశ్వరుడి తరువాతనే మిగతా వారందరూ.
ఆ ప్రేమతోనే ఆ భోళా శంకరుడికి వాహనంగా మారాడు నందీశ్వరుడు. శివుడి పాద పద్మాలను ఎడతెగకుండా నందీశ్వరుడు దర్శిస్తుంటాడు. శంకరుడు కూడా భక్తాగ్రగణ్యుడైన నందీశ్వరుడి అనుగ్రహ దృష్టిని ప్రసరింపజేస్తుంటాడు. వీరిరువురి మధ్య మానవులు నడిస్తే వారి పరస్పర దృష్టి ప్రసారానికి విచ్ఛేదం ఏర్పడుతుంది. దీంతో వారిపై వీరిద్దరికీ కోపం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలా జరిగితే ఏదైనా శాపం పెడుతుంటారని మన పెద్దలు చెబుతుంటారు. గుడికి వెళ్లినప్పుడు వచ్చే పుణ్యం కంటే వారిద్దరికీ కోపం తెప్పించి శాప గ్రస్తులు అవ్వడం కంటే శివలింగానికి నందీశ్వరుల మధ్య నడకూడదు అని చెబుతుంటారు.