Home » ODI World Cup 2023 : ఆ రెండు ఇండియా పిచ్‌ లంటే వణికిపోతున్న పాక్‌..? కారణం ఇదేనా..?

ODI World Cup 2023 : ఆ రెండు ఇండియా పిచ్‌ లంటే వణికిపోతున్న పాక్‌..? కారణం ఇదేనా..?

by Bunty
Ad

టీమిండియా మరియు పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ అంటే అందరూ ఎంతో ఆతృతంగా చూస్తారు అన్న సంగతి తెలిసిందే. ఇక వరల్డ్ కప్ లాంటి ఐసీసీ టోర్నమెంటులో… ఈ రెండు జట్లు తలపడితే ఆ కిక్కే వేరు. అయితే తాజాగా.. ఇండియాలో.. కొన్ని పిచ్ లపై ఆడేందుకు పాకిస్తాన్ జట్టు కాస్త భయపడుతోంది. వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నమెంట్ ఈ ఏడాది మన ఇండియాలో జరగనున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ టోర్నమెంట్ కు మన భారతదేశం ఆతిథ్యం ఇవ్వనుంది.

Advertisement

ఈ తరుణంలోనే బిసిసిఐ… ఇప్పటికే ఈ మ్యాచ్ ల గ్రౌండ్ లను ప్రకటించి… ముసాయిదా షెడ్యూల్ ను ఐసీసీకి పంపించింది బీసీసీఐ. ఇక అటు ఈ టోర్నీ ఫైనల్ షెడ్యూల్ ను ప్రకటించే ముందు సభ్య దేశాల నుంచి సూచనలు మరియు సలహాలను ఐసిసి తాజాగా కోరింది. అయితే ఐసీసీ కోరడంతో… పాకిస్తాన్ ఈ ముసయిదా షెడ్యూల్ పై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఐసీసీ అందించిన ముసాయిదా షెడ్యూల్ ప్రకారం… పాకిస్తాన్ జట్టు చెన్నై మరియు బెంగళూరు స్టేడియాలలో ఆడనుంది.

Advertisement

చెన్నైలో ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో అలాగే బెంగళూరులో ఆస్ట్రేలియా జట్టుతో పాకిస్తాన్ తలబడనుంది. అయితే ఈ రెండు మ్యాచ్లకు గాను వేదికను మార్చాలని ఐసిసిని పాకిస్తాన్ కోరింది. చెన్నైలో ఆఫ్ఘనిస్తాన్ తో మ్యాచ్ జరిగితే… ఆ జట్టు స్పిన్నర్లు రషీద్ ఖాన్ మరియు నూర్ మరిచిపోయే ప్రమాదం ఉందని… అక్కడ స్పిన్ కు అనుకూలించే వాతావరణము ఉందని పాకిస్తాన్ ఆందోళన చెందుతోంది. ఇక బెంగళూరు లో ఆస్ట్రేలియాతో కనపడితే… అది బ్యాటింగ్ పిచ్ కనుక ఆస్ట్రేలియా బ్యాటర్లు రెచ్చిపోయే ప్రమాదం ఉందని పాకిస్తాన్ ఆలోచన చేస్తోంది. ఈ రెండు అంశాలను దృష్టిలో పెట్టుకొని… ఆ రెండు గ్రౌండ్ లను మార్చాలని… ఇతర ప్రదేశాలలో ఈ రెండు మ్యాచ్లను పెట్టాలని పాకిస్తాన్.. ఐసీసీ కోరినట్లు సమాచారం అందుతోంది. మరి దీనిపై ఐసీసీ ఎలా స్పందిస్తుందో చూడాలి.

 

ఇవి కూడా చదవండి

టీమిండియా కొత్త కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్ ?

రోహిత్ శర్మకు బిగ్ షాక్.. టీమిండియా కెప్టెన్ గా అజింక్య రహానే !

షోయబ్ అక్తర్ కూతుర్ని చూశారా? అచ్చం హీరోయిన్ లా ఉందిగా ! 

 

 

Visitors Are Also Reading