Home » Maharshi:’మహర్షి’ గొప్ప కల్ట్ క్లాసిక్ హిట్ అవ్వాల్సిన సినిమా ఎందుకు ఫ్లాప్ అయ్యిందో తెలుసా ?

Maharshi:’మహర్షి’ గొప్ప కల్ట్ క్లాసిక్ హిట్ అవ్వాల్సిన సినిమా ఎందుకు ఫ్లాప్ అయ్యిందో తెలుసా ?

by Sravya
Ad

Maharshi: మహర్షి సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. మహేష్ బాబు నటించిన మహర్షి కాదు ఇదివరకు మహర్షి సినిమా వచ్చింది. దర్శకుడు వంశీ ఈ సినిమాని తీశారు. ఈ సినిమా ఇప్పటికి కూడా కల్ట్ క్లాసిక్ మూవీ అని చెప్పొచ్చు. ఈ మూవీలో పాటలు హీరోగా నటించిన రాఘవ పర్ఫామెన్స్ అద్భుతంగా ఉంటాయి. మహర్షి సినిమాకి సంగీతాన్ని ఇళయరాజా అందించారు ఒక్కో పాట ఒక్కో ఆణిముత్యం అని అందరూ అంటూ ఉంటారు సినిమాలో అప్పుడప్పుడే హీరోయిన్గా అడుగులు వేస్తున్న భానుప్రియ చెల్లెలు నిశాంతి హీరోయిన్గా నటించింది.

maharshi-movie

Advertisement

 

Also read:

మూవీ విడుదల అయ్యి దాదాపు 25 ఏళ్లు గడిచిపోయాయి అయినా కూడా సినిమా గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. ఈ సినిమా కమర్షియల్ గా హిట్ సాధించలేదు ఎందుకు ఆడలేదో కానీ ఇప్పుడు చూస్తే మాత్రం చాలా అద్భుతమైన ఫీలింగ్ అందరికీ వస్తోంది. సినిమాలో నటించిన రాఘవ పెర్ఫార్మన్స్ చూసి అందరూ ఈయన ఎందుకు గొప్ప నటుడు కాలేకపోయాడు అని అడుగుతున్నారు. ఇప్పటికీ టీవీలో ఈ సినిమా వస్తే చాలా మంది చూస్తూ ఉంటారు.

Advertisement

ఈ మూవీ చూస్తే గుండె బాగా బరువెక్కి పోతుంది ఈ సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయింది. ఏదేమైనా అప్పట్లో మహర్షి సినిమాకి ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది అలానే అందులో హీరోగా నటించిన రాఘవకి కూడా ఫాలోయింగ్ బానే ఉంది. అంతగా ప్రేమిస్తున్నా ఈ వ్యక్తిని హీరోయిన్ నిశాంతి ఎందుకు ప్రేమించలేదు అనే పాయింట్ అర్థం కాలేదు. పైగా భానుప్రియ చెల్లెలు అంటే ఓ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేశారు ఆ అందాన్ని అందుకోవడంలో అభినయాన్ని ప్రదర్శించడంలో కాస్త ఫెయిల్ అయింది. మహర్షిని నిరాకరించడంలోని పాయింట్ కూడా జనాలకి కనెక్ట్ కాలేదు అందువలన సినిమా పరాజయాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

 

Visitors Are Also Reading