Home » తెలుగులో గొప్ప హీరోయిన్ కానీ కన్నడలో సౌందర్య ఎందుకు ఫెయిల్ అయ్యారు ?

తెలుగులో గొప్ప హీరోయిన్ కానీ కన్నడలో సౌందర్య ఎందుకు ఫెయిల్ అయ్యారు ?

by Anji
Ad

అలనాటి నటి సౌందర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  ఎందరో అభిమానుల ఆరాధ్య దేవత సౌందర్య. ఆమె తెలుగులో ఎంతో మంది హీరోయిన్స్ అందుకోలేని స్థాయికి ఆమె చేరుకున్నారు. తెలుగు సినిమాల్లో ఎక్కువగా నటించి ఎందరో హృదయాల్లో ఆమె చెరగని స్థానాన్ని సంపాదించుకున్నారు.

heroine-soundarya

Advertisement

తెలుగులో టాప్ హీరోయిన్ గా ఎదిగిన కూడా ఆమె సొంత భాషలో మాత్రం ఆమె గొప్పగా సినిమాలు చేయలేదని స్వయంగా ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. అది తనకు ఎంతో లోటుగా ఉందని కూడా సౌందర్య తెలిపారు. ఆ లోటు పూడ్చుకునేందుకు తన సొంత నిర్మాణ సంస్థను స్థాపించి ద్వీప అనే ఒక చిత్రాన్ని కూడా తీశారు సౌందర్య.

ఆ చిత్రానికి ఉత్తమ జాతీయ చిత్రంగా కూడా అవార్డు దక్కడం విశేషం. ఇక సౌందర్య స్వంత నిర్మాణ సంస్థ అయినా సత్య మూవీ మేకర్ ద్వారానే ఈ చిత్రాన్ని నిర్మించింది. వాస్తవానికి ఈ సినిమా షూటింగ్ 22 సంవత్సరాల క్రితం అంటే 2000 సంవత్సరంలో మొదలైంది. కానీ అదే సమయంలో కర్ణాటకలో స్టార్ హీరో అయినా రాజ్ కుమార్ ని స్మగ్లర్ వీరప్పన్ కిడ్నాప్ చేయడంతో ఓ రెండు సంవత్సరాల పాటు ఆ సినిమా షూటింగ్ వాయిదా పడింది. ఆ తర్వాత 2002లో మళ్లీ షూటింగ్ మొదలైంది. ఇక ఎక్కువ భాగం షూటింగ్ కర్ణాటక పట్టణానికి అతి సమీపంలో గల లింగనమ్మకి జలాశయ పరిసరాల్లో పూర్తిచేశారు.

Advertisement

Also Read :  ఆర్జే సూర్య అంతటి కష్టాలను అనుభవించారా ?

ఇక ద్వీప సినిమా షూటింగ్ 70 శాతం వానలోనే జరగడం విశేషం. అసలైన వానలోనే సన్నివేశాలను చిత్రీకరించడం లో కెమెరామెన్ రామచంద్ర హల్కర్ తన కెమెరా చాతుర్యాన్ని చూపించారు. ద్వీప సినిమాలో సౌందర్య కనిపించిన ప్రతి సన్నివేశం కూడా ఒక అద్భుతమైన పెయింటింగ్ ఉంటుంది. ఈ సినిమా ద్వారా ఆమె కొంత కన్నడ సినిమాల్లో నటించాలనే లోటును పూడ్చుకోగలిగారు. ఒక ద్వీప సినిమా డబ్బింగ్ కూడా సౌందర్య స్వయంగా చెప్పుకొన్నారు. ద్వీప సినిమా తరువాత తెలుగులో ఒక సినిమా తీయాలి అని అనుకున్నారు సౌందర్య. కథ కూడా ఓకే చేసిన తర్వాత అనుకోకుండా ఆమె కన్నుమూయడంతో ఆ కథని నంది దాస్ హీరోయిన్ గా కంలో అనే పేరుతో చేశారు.

Also Read :   భార్య‌ను కాద‌నుకుని భ‌ర్త ప‌రాయి స్త్రీలను కోరుకుంటే వ‌చ్చే 5 స‌మ‌స్య‌లు ఇవేన‌ట‌..!

Visitors Are Also Reading