విశ్వ విఖ్యాత నటుడు ఎన్టీఆర్ శత జయంతి వేడుకలకు సూపర్ స్టార్ రజినీకాంత్ విచ్చేసి చంద్రబాబుని ప్రశంసించిన విషయం తెలిసిందే. రజినీకాంత్ ఎన్టీఆర్, చంద్రబాబుని ప్రశంసించడం.. హైదరాబాద్ అభివృద్ధి గురించి వివరించడంతో వైసీపీ నేతలు కౌంటర్ ఇవ్వడం పట్ల ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. మరోవైపు రజినీకాంత్ అభిమానులు వైసీనీ నేతలకు వార్నింగ్ ఇస్తున్నారు. తమిళనాడు నుంచి వచ్చి ఇక్కడ నీతులు చెబితే వినే స్థితిలో తాము లేమంటూ రజినిపై వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు.
Also Read : ఎండాకాలంలో వీళ్లు అస్సలు పుచ్చకాయని తీసుకోకూడదు…!
Advertisement
రజినీని విమర్శించిన వారిలో సినీ ఇండస్ట్రీకి చెందినవారున్నారు. రజినీని వైసీపీ నేతలు విమర్శలు చేస్తుంటే.. ఆయన ఫ్యాన్స్ టీడీపీ నాయకులకు మద్దతుగా నిలిచారు. ఈ విషయంలో తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులెవ్వరూ స్పందించలేదు. కానీ టాలీవుడ్ నటుడు జగపతి బాబు మాత్రం స్పందించారు. రజినీకాంత్ జరిగిన వాస్తవాలను చెప్పాడని పేర్కొన్నాడు. మరోవైపు రజినీకాంత్ పై విమర్శలు చేసినందుకు.. ఆయనకు వైకాపా నేతలు క్షమాపణలు చెప్పాలంటూ అభిమానులు ట్విట్టర్ వేదికగా డిమాండ్ చేశారు. రజిని ఎవరినీ కించపరచనప్పటికీ అలా ఎలా ట్రోల్ చేస్తారని ప్రశ్నించారు. చంద్రబాబు కూడా సీఎం జగన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్ ప్రభుత్వంపై రజినీ విమర్శ చేయకపోయినా, వైఎస్సార్ సీపీ ఆయనపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తోందని మండిపడ్డారు.
Advertisement
Also Read : ఎండాకాలంలో కూల్ వాటర్ తాగేస్తున్నారా…? అయితే ఈ విషయాలను తెలుసుకోండి
సమాజంలో ఎంతో గౌరవం ఉండే లెజెండరీ పర్సనాలిటీపై ఇలాంటి నీచపు వ్యాఖ్యలు చేయడం బాధ కలిగిస్తుందన్నారు. రజినీపై ఇంతగా ట్రోల్స్ చేస్తున్న ప్రియ మిత్రుడు అని చెప్పుకునే మోహన్ బాబు స్పందించకపోవడంపై అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. రజినీకాంత్ కు మోహన్ బాబు కి మధ్య ఎన్నో ఏళ్ల నుంచి మంచి అనుబంధం కొనసాగుతుంది. తమ మధ్య ఫ్రెండ్ షిప్ గురించి ఇద్దరు అనేక సందర్భాల్లో వెల్లడించారు. ఇప్పుడు రజనీపై వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్న మోహన్ బాబు మాత్రం స్పందించలేదు. ఈ నేపథ్యంలో తన స్నేహితుడికి మోహన్ బాబు ఎందుకు సపోర్టుగా నిలవలేదని, అలా మౌనంగా ఉండటంలో అర్థమేంటని ప్రశ్నిస్తున్నారు. తన స్నేహితుడిని అంత దారుణమైన మాటలు అంటుంటే ఆయన ఎలా తట్టుకోగలుగుతున్నారని అంటున్నారు.
Also Read : హ్యాపీ డేస్ లో నటించిన అప్పు ఇప్పుడు ఎలా ఉంది.. ఏం చేస్తుందో తెలుసా ?