కొంతమంది చీటికిమాటికి భార్యలను కొడుతూ ఉంటారు కారణం ఏదైనా కొట్టడం అనేది తప్పే. కాబట్టే చుట్టాలు మహిళకు రక్షణ గా ఉంటాయి. ఈ నేపథ్యంలోనే గృహ హింస చట్టం కూడా వచ్చింది. అయితే ఒకప్పుడు మహిళలపై దాడులు ఎక్కువగా ఉండేవి కానీ ప్రస్తుతం మాత్రం చాలా వరకు తగ్గిపోయాయనే చెప్పాలి. అయితే అసలు భర్తలు భార్యలను ఎందుకు కొడతారు… వారి మధ్య గొడవలకు కారణం ఏంటి అనే దానికి జాతీయ కుటుంబ ఆరోగ్య సంస్థ కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేసింది. ఈ ప్రయత్నంలో అనేక ఆసక్తికర సమాధానాలు వచ్చాయట. భర్తలు భార్యలను కొట్టడం తప్పు కాదా అని మహిళలను ప్రశ్నించగా ఎక్కువ శాతం మంది అందులో తప్పేముంది అంటూ ఆన్సర్లు ఇచ్చారట…ఇక భార్యను ఎందుకు కొడుతున్నారు అని భక్తులను ప్రశ్నించగా.. వారు 7 కారణాలు చెప్పారట. ఆ కారణాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం….
Advertisement
Advertisement
భార్యలు తమ భర్తలకు చెప్పకుండా బయటకి వెళుతున్నారు అనే కారణంగానే ఎక్కువమంది కొడతారని చెప్పారు. ఇక మరికొందరు భర్తలు భార్య చెప్పినమాట వినడం లేదు, పిల్లలను సరిగా చూసుకోవడం లేదు, వంట సరిగ్గా వండటం లేదు, మరియు శృంగారాన్ని తిరస్కరించడం ఇలాంటి కారణాలతో కూడా కొడతారట. అంతే కాకుండా చీటికి మాటికి గొడవలు పెట్టుకోవడం.. అక్రమ సంబంధాలు..భార్యలపై అనుమానం, భర్త తరపున బంధువులకు రెస్పెక్ట్ ఇవ్వకపోవడం లాంటివి కూడా భార్యలను కొట్టేందుకు దారి తీస్తాయట. ఈ సర్వేలో తెలుగు రాష్ట్రాలు మరియు ఇతర రాష్ట్రాల భర్తలు పాల్గొన్నట్లు తెలుస్తోంది.
Also Read: ప్రపంచంలోనే ఎత్తయిన రైల్వే ట్రాక్ ను నిర్మిస్తున్న భారత్…దాని ప్రత్యేకత ఏంటంటే…?