Telugu News » Blog » ప్రపంచంలోనే ఎత్తయిన రైల్వే ట్రాక్ ను నిర్మిస్తున్న భారత్…దాని ప్రత్యేకత ఏంటంటే…?

ప్రపంచంలోనే ఎత్తయిన రైల్వే ట్రాక్ ను నిర్మిస్తున్న భారత్…దాని ప్రత్యేకత ఏంటంటే…?

by AJAY
Published: Last Updated on
Ads

భారత్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వంతెనను నిర్వహిస్తోంది. ఈ వంతెనను ఇండియా మణిపూర్ లో నిర్మిస్తోంది. 141 మీటర్ల ఎత్తులో ఈ రైలు మార్గాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఇది ప్రపంచంలోనే ఎత్తైన ప్రస్తుతం ఉన్న యూరప్ లోని మోంటెనెగ్రోల్ లోని మాలా- రిజెకా వయడక్ట్ లో ఉన్న 139 మీటర్ల వంతెన రికార్డును బ్రేక్ చేసేదిగా ఉంటుంది. ఇదిలా ఉండగా మణిపూర్ లో నిర్మిస్తున్న వంతెన బ్రాడ్ గేజ్ నెట్వర్క్ తో నిర్మాణం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత కేవలం 2 నుంచి 2.5 గంటల్లోనే 111 కిలోమీటర్ల దూరం చేరుకోవచ్చు. ఈ వంతెన నిర్మాణాన్ని 2023 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు.

Advertisement

Advertisement

Manipur railway track

Manipur railway track

ఇక 12 కిలోమీటర్ల వరకు విస్తరించే మొదటి దశ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. రెండో దశలో 90 శాతం పనులను పూర్తి చేయనున్నారు. ఇక ఈ వంతెన పూర్తయితే ప్రపంచంలోనే ఎత్తయిన మంతెన మనదేశంలోనే ఉండనుంది. అంతే కాకుండా ఈ వంతెనను అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మిస్తున్నారు. 723 మీటర్ల పొడవు లో తొమ్మిది సపోర్టింగ్ పిల్లర్లను ఈ వంతెన కోసం నిర్మిస్తున్నారు. వీటి తయారీలో 11780 మెట్రిక్ టన్నుల ఉక్కును ఉపయోగిస్తున్నారు. జిరిబామ్ ఇంఫాల్ లో 111 కిలోమీటర్ల పొడవైన మార్గంలో నోని జిల్లాలో నిర్మిస్తున్న ఈ వంతెన ఎత్తు 141 మీటర్లు గా ఉంటుంది.