మనజీవితాల్లో తల్లితండ్రులు ఎంత ముఖ్యమైన పాత్రను పోశిస్తారో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరంలేదు. జన్మనిచ్చిన నాటి నుండి పిల్లలే తమ జీవితం అనుకుని జీవిస్తుంటారు. వారి కోసమే కష్టపడుతుంటారు. అయితే తాజాగా తల్లిదండ్రులు పిల్లలతో ఎలా ఉంటారు..ఎలా ఉండాలి అనే విషయాలని ఓ ప్రముఖ మానసిక వైద్యురాలు వెల్లడించారు. ఆమె ఏం చెప్పారో ఇప్పుడు చూద్దాం…. అమ్మ ఇంట్లో మరియు కుటుంబ సభ్యులతో ఎలా ఉండాలో నేర్పిస్తే నాన్న దగ్గర నుండి సొసైటీలో ఎలా ఉండాలి..జీవితంలో ఎలా ఎదగాలి అన్నది నేర్చుకుంటారు. ఇక అమ్మానానలు పిల్లలను ప్రేమించడంలో ఒకే స్థాయిలో ఉన్నా..ప్రేమను ప్రదర్శించడంలో కాస్త తేడా ఉంటుంది.
పిల్లలు తప్పు చేస్తే తల్లి కాస్త ఆ తప్పును కప్పిపుచ్చడానికి ప్రయత్నిస్తుంది. కానీ నాన్న మరోసారి అలాంటి తప్పులు చేయకుండా అప్పుడే వార్నింగ్ ఇస్తుంటారు. అంతే కాకుండా తమ పిల్లలు సమాజంలో ధైర్యంగా బతకాలని..ఎవరికీ భయపడకుండా సక్సెస్ అవ్వాలని అనుకుంటారు. ఇక పిల్లలు ఇంట్లో అల్లరి చేస్తే వారిని తిట్టడం కొట్టడం చేస్తుంటారు. కానీ అలా అస్సలు చేయకూడదు. బూతులు మాత్రం అసలు తిట్టకూడదు. పిల్లలు మనల్ని చూసే అన్నీ నేర్చుకుంటారు. కాబట్టి తల్లి దండ్రులు ఏం చేస్తే పిల్లలు అదే నేర్చుకుంటారు.
Advertisement
Advertisement
పిల్లలకు ఏదైనా నేర్పిస్తే చేయరు కానీ అదే మనం చేస్తే చూసి ఫాలో అవుతుంటారు. సాధారణంగా ఇంట్లో ఆడపిల్లలకు నాన్న అంటే ఎక్కువ ఇష్టం ఉండగా అబ్బాయిలకు అమ్మ అంటే ఎక్కువ ఇష్టం ఉండటం చూస్తుంటాం. దానికి కారణం ఆడపిల్లలను ఎక్కువగా భయటకు తీసుకెళ్లేది నాన్నే…అబ్బాయిలంటే భయట తిరిగి వస్తారు ఏం కావాలన్నా కొనుకుంటారు. ఏం తినాలన్నా తింటారు. కానీ ఆడపిల్లలు ఎప్పుడు భయటకు వెళ్లినా నాన్నే అన్నీ కొనిస్తారు. వారికి రక్షణగా అనిపిస్తారు కాబట్టి నాన్నలను ఇష్టపడుతుంటారు.
Also Read: సినిమాల్లోకి వచ్చాక పేరుమార్చుకున్న హీరోయిన్లు అసలు పేర్లు ఏంటంటే..?