Home » వర్షాకాలంలో నాన్ వెజ్ ఎందుకు తినొద్దు… తినడం వల్ల కలిగే సమస్యలు ఏంటో తెలుసా..?

వర్షాకాలంలో నాన్ వెజ్ ఎందుకు తినొద్దు… తినడం వల్ల కలిగే సమస్యలు ఏంటో తెలుసా..?

by Bunty
Ad

సాధారణంగా మనదేశంలో ఎక్కువమంది మాంసాహార ప్రియులు ఉన్నారు. అయితే ప్రతి కాలంలోనూ మాంసాహారం తినడం మంచిది కాదని వైద్యశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. వైద్యశాస్త్రం ప్రకారం వర్షాకాలంలో మాంసాహారం తినడం మంచిది కాదట. వర్షాకాలంలో జీర్ణవ్యవస్థ సరిగ్గా ఉండదని… అందువల్ల వర్షాకాలంలో మాంసాహారాన్ని తక్కువగా తీసుకోవడం వల్ల మన ఆరోగ్యాన్ని కాపాడుకున్నట్లు అవుతుంది.

Advertisement

అయితే ప్రతి ఒక్కరు సీజన్ ఆధారంగా ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. వర్షాకాలంలో నాన్ వెజ్ ఎక్కువగా తినడం వల్ల కొన్ని రకాల సమస్యలు ఎదురవుతాయి. వర్షాకాలంలో చేపల సీజన్ కావడంతో ఎక్కువమంది చేపలను తింటూ ఉంటారు. ఇది తినడం వల్ల అనారోగ్యాన్ని మూటగట్టుకున్నట్లు అవుతుంది. వర్షాకాలంలో చేపలు సంతానోత్పత్తిని చేయడం వల్ల చేపల శరీరంలో అనేక మార్పులు జరుగుతాయి. అలాంటి సమయంలో చేపలకు బ్యాక్టీరియా అంటుకుంటుంది. ఆ సమయంలో చేపలను మనం తినడం వల్ల ఆ బ్యాక్టీరియా మన శరీరానికి అంటుకుంటుంది. అయితే చేపలను తినాలని కచ్చితంగా అనిపించినప్పుడు వాటిని కొనే సమయంలో లో కొన్ని జాగ్రత్తలు పాటించి కొనుగోలు చేయాలి. చేపను కొనే ముందు వాటిని నొక్కి చూసి మెత్తగా ఉన్నట్టయితే తీసుకోకూడదు.

Advertisement

గట్టిగా ఉన్న చేపలను కొనుగోలు చేయాలి. అలాగే వాటి బోప్పలను చూసి కొనుక్కోవాలి. సాధారణంగా ఈ చేపలు అరగడానికి రెండు నుంచి మూడు రోజుల సమయం పడుతుంది. అలాగే కోడిగుడ్లను కూడా తినేముందు పరీక్షించుకోవాలి. గుడ్డు నీలం గట్టిగా ఉండాలి పలుచగా ఉన్నట్లయితే అది పాడైన గుడ్డు అవుతుంది. అలాగే చికెన్ కొనే సమయంలో దాని స్కిన్ మీద మచ్చలు లేదా గీతలు ఉన్నాయా లేదా అని చూసుకోవాలి. మచ్చలు లేదా గీతలు ఉన్నట్లయితే అది ఇన్ఫెక్షన్ కి గురి అయినట్లుగా గుర్తించాలి. ఇలా మాంసాహారాన్ని కొనుగోలు చేసే సమయంలో ఇలాంటి జాగ్రత్తలు పాటించాలి. అలాగే మాంసాహారాన్ని ఇంటికి తెచ్చిన తర్వాత అలాగే వండకుండా వేడి నీళ్లతో శుభ్రం చేసి కాస్త పసుపు, ఉప్పు వేసి శుభ్రం చేసుకొని వండుకోవాలి.

 

ఇవి కూడా చదవండి

SRH కోసం సంచలన నిర్ణయం తీసుకున్న కావ్యా పాప !

ఈ ప్లేస్ లలో పుట్టుమచ్చ ఉంటే.. మీకు అదృష్టం మాములుగా పట్టదు !

ఆసియా కప్ 2023 షెడ్యూల్ వచ్చేసింది..ఇండియా, పాక్ మ్యాచ్ ఎప్పుడంటే ?

Visitors Are Also Reading