Home » కుక్కలు వాహ‌నాల టైర్ల‌పైనే ఎందుకు మూత్రం పోస్తాయో తెలుసా..?

కుక్కలు వాహ‌నాల టైర్ల‌పైనే ఎందుకు మూత్రం పోస్తాయో తెలుసా..?

by AJAY
Ad

కుక్క‌ల‌ను చాలా మంది ఇష్ట‌ప‌డుతుంటారు. దానికి కార‌ణం మిగ‌తా జంతువుల కంటే కుక్క‌ల‌కు చాలా విశ్వాసం ఉంటుంది. కొన్ని తెలివైన కుక్క‌లు య‌జ‌మాని ఏం చెబితే అదే చేస్తాయి. ఇక కుక్కల్లో చాలా బ్రీడ్స్ కూడా ఉంటాయి. కొన్ని పొట్టిగా ఉంటే కొన్ని పొడుగ్గా ఉంటాయి. వేల నుండి ల‌క్ష‌ల ధ‌ర‌లు ఉండే కుక్క‌లు కూడా ఉన్నాయి. అంత ఖ‌ర్చు పెట్టి కొన్న కుక్క‌లను య‌జ‌మానులు ఎంత ముద్దుగా చూసుకుంటారో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రంల లేదు.

Advertisement

పైకి ఎక్కించుకుని సైతం ముద్దులు పెడుతూ ఉంటారు. ఇక చాలా మంది సెల‌బ్రెటీల ఇండ్ల‌లో అయితే ప‌దుల సంఖ్య‌లో కుక్క‌లు ఉంటాయి. వాటి ఆల‌నా పాల‌నా చూసుకునేందుకు మ‌నుషులు కూడా ఉంటారు. స‌మ‌యానికి ఆహారం పెట్ట‌డం ఉద‌యం మ‌రియు సాయంత్రం జాగింగ్ కు తీసుకువెళ్ల‌డం ఇలా అన్ని తామే చూసుకుంటారు.

Advertisement

కేవ‌లం పెంపుడు కుక్క‌లే కాకుండా వీధికుక్క‌లు కూడా ఎంతో తెలివైన‌వి. వీధి కుక్క‌లు ఎవ‌రైనా కొత్త వాళ్లు వీధిలోకి వ‌చ్చారంటే చాలు అర‌వ‌డం మొద‌లు పెడతాయి. అందుకే కుక్క‌లను గ్రామ సింహాలు అని కూడా అంటారు. ఇదిలా ఉంటే కుక్క‌ల‌కు ఒక చెడ్డ అల‌వాటు కూడా ఉంది. అదేంటంటే కుక్క‌లు ఎక్కువ‌గా వాహ‌నాల టైర్ల పైనే మూత్రం పోస్తుంటాయి.

also read : చైతూ “లవ్ స్టోరీకి” రికార్డు స్థాయి టీఆర్పీ…!

చూట్టూ ఎంతో ప్ర‌దేశం ఉన్నా కూడా అక్క‌డ పోయ‌కుండా కార్ టైర్ల‌పైనే పోస్తుంటాయి. అయితే దానికి ఓ కార‌ణం కూడా ఉంద‌ట. వాహ‌నాలు ఎక్క‌డెక్క‌డో తిరిగి వ‌స్తాయి. వాటి టైర్ల‌కు చెత్త అంటుకుంటుంది. కాబ‌ట్టి కుక్క‌లు వాటి వాస‌న చూసి అది చెత్త అని భావించి అక్క‌డే మూత్రం పోస్తాయ‌ట‌. అంటే వాటి దృష్టిలో అవి మంచి ప‌ని చేస్తున్నామ‌ని ఫీల్ అవుతాయ‌న్న‌మాట‌.

Visitors Are Also Reading