Home » చైతూ “లవ్ స్టోరీకి” రికార్డు స్థాయి టీఆర్పీ…!

చైతూ “లవ్ స్టోరీకి” రికార్డు స్థాయి టీఆర్పీ…!

by AJAY
Ad

యువ‌సామ్రాట్ అక్కినేని నాగ‌చైత‌న్య హీరోగా న‌టించిన సినిమా ల‌వ్ స్టోరీ. ఈ సినిమాకు శేఖ‌ర్ కమ్మ‌ల ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. రోటీన్ క‌థ‌తో వ‌చ్చినా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వ‌ద్ద మంచి విజ‌యాన్ని న‌మోదు చేసుకుంది. ఈ సినిమాలో టాలెంటెడ్ హీరోయిన్ సాయిప‌ల్ల‌వి హీరోయిన్ గా న‌టించింది. ఈ సినిమా పాట‌ల‌తోనే సినిమాకు ఓ రేంజ్ లో క్రేజ్ వ‌చ్చింది. ముఖ్యంగా సినిమాలోని సారంగ‌ద‌రియా యూట్యూబ్ ను షేక్ చేసింది. అంతే కాకుండా సినిమా టీజ‌ర్ మ‌రియు ట్రైల‌ర్ కూడా ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి.

Love story

Advertisement

Advertisement

ఇక సినిమా క‌రోనా ఆంక్ష‌ల మ‌ధ్య విడుద‌ల‌గా మంచి విజ‌యం సొంతం చేసుకుంది. 35కోట్ల‌కు పైగా షేర్ ను రాబ‌ట్టి సూప‌ర్ హిట్ గా నిలిచింది.ఇక ఈ సినిమాపై ఉన్న అంచ‌నాల‌తో ఈ ముందుగానే శాటిలైట్ రైట్స్ ను మా టీవీ 8కోట్ల‌కు సొంతం చేసుకుంది. మీడియం రేంజ్ హీరోల సినిమాలకు 8కోట్లు అంటే మామూలు విష‌యం కాదు.

 

ఆ విధంగా చూసుకుంటే యువ‌సామ్రాట్ రికార్డును క్రియేట్ చేశాడు. ఇక మా ఆశించిన‌ట్టుగా ల‌వ్ స్టోరీ సినిమా కూడా అత్య‌ధిక టీఆర్పీ ని సొంతం చేసుకుంది.ఫ‌స్ట్ డే బిగ్గెస్ట్ రేటింగ్ సొంతం చేసుకున్న సినిమాగా నిలిచింది. మొద‌టి సారి సినిమా ప్ర‌సార‌మైన‌న‌ప్పుడు ఎస్డీ వ‌ర్ష‌న్ లో 16.06 టీఆర్పీని సొంతం చేసుకుంది. అంతే కాకుండా హెడీ వ‌ర్ష‌న్ లో 18.02 టీఆర్పీని సొంతం చేసుకుంది. థియేట‌ర్ల త‌ర‌వాత డిజిట‌ల్ లోనూ రికార్డు స్థాయిలో వ్యూవ్స్ ను సంపాదించింది.

Visitors Are Also Reading